BREAKING
హోర్ముజ్ జలసంధిలో పడిపోయిన నౌకల రాకపోకలు మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ మొబైల్ ఫోన్ ద్వారానే కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం డౌన్‌లోడ్ చేసుకునే అవ‌కాశం గ్లోబల్ బాండ్ల జారీపై విదేశీ బ్యాంకులకు కఠిన నిబంధనలు తెచ్చే ఆలోచనలో దక్షిణ కొరియా మయన్మార్‌కు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తాం: మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా జగ్గారెడ్డి దీక్ష తూర్పు జెరూసలేం కాన్సులేట్ బోర్డులను తొలగించిన బ్రిటన్ ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో నేడు చంద్ర బాబు భేటీ వికారాబాద్ జిల్లాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన గ్యాస్ సిలిండర్ల లారీ నేడు ఎస్‌ఈసీ కీలక సమీక్ష: కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ మయన్మార్ సైనిక ప్రభుత్వంతో అమెరికా ప్రత్యక్ష చర్చలు కొందుర్గు స్కాన్ ఎనర్జీ పరిశ్రమలో కార్మికుడి మృతి.... స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమన్వయంతో పనిచేయాలి లింగాల గ్రామంలో పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలి వైఎస్ఆర్ సీపీ క్యాడర్‌కు ఐడీ కార్డుల పంపిణీ జడ్పీ హైస్కూల్ కు ఆట వస్తువులు వితరణ కరెంట్ కోతలతో ఎండిపోతున్న పంటలు వికారాబాద్-తాండూర్ రహదారిపై రైతుల ఉధృత ధర్నా చెల్లాపూర్‌లో రోడ్డుపై మురుగునీరు.. పట్టించుకోని అధికారులు

నేడు ఎస్‌ఈసీ కీలక సమీక్ష: కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్

Select Suryaa Now
నేడు ఎస్‌ఈసీ కీలక సమీక్ష: కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్

విజయవాడ, మేజర్ న్యూస్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) కసరత్తును ముమ్మరం చేసింది. ఎన్నికల ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిస్థితులపై సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నేడు ఉదయం 11 గంటలకు అత్యున్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు. ఈ కీలక భేటీలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది నియామకం, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై కమిషన్ అధికారులతో విస్తృతంగా చర్చించనుంది. ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణపై ఈ సమావేశంలో జిల్లా యంత్రాంగానికి ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.

✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా