BREAKING
మయన్మార్‌కు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తాం: మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా జగ్గారెడ్డి దీక్ష తూర్పు జెరూసలేం కాన్సులేట్ బోర్డులను తొలగించిన బ్రిటన్ ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో నేడు చంద్ర బాబు భేటీ వికారాబాద్ జిల్లాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన గ్యాస్ సిలిండర్ల లారీ నేడు ఎస్‌ఈసీ కీలక సమీక్ష: కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ మయన్మార్ సైనిక ప్రభుత్వంతో అమెరికా ప్రత్యక్ష చర్చలు కొందుర్గు స్కాన్ ఎనర్జీ పరిశ్రమలో కార్మికుడి మృతి.... స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమన్వయంతో పనిచేయాలి లింగాల గ్రామంలో పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలి వైఎస్ఆర్ సీపీ క్యాడర్‌కు ఐడీ కార్డుల పంపిణీ జడ్పీ హైస్కూల్ కు ఆట వస్తువులు వితరణ కరెంట్ కోతలతో ఎండిపోతున్న పంటలు వికారాబాద్-తాండూర్ రహదారిపై రైతుల ఉధృత ధర్నా చెల్లాపూర్‌లో రోడ్డుపై మురుగునీరు.. పట్టించుకోని అధికారులు కోట్ డి ఐవోర్ విదేశాంగ మంత్రితో ఎస్. జైశంకర్ భేటీ: ద్వైపాక్షిక సంబంధాల విస్తరణపై కీలక చర్చలు! భూమి కోసం రక్తసంబంధాన్ని మరిచిన కొడుకు.. నానా పటేకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమన్వయంతో పనిచేయాలి లింగాల గ్రామంలో పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలి వైఎస్ఆర్ సీపీ క్యాడర్‌కు ఐడీ కార్డుల పంపిణీ

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమన్వయంతో పనిచేయాలి  లింగాల గ్రామంలో పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలి  వైఎస్ఆర్ సీపీ క్యాడర్‌కు ఐడీ కార్డుల పంపిణీ

వత్సవాయి: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వత్సవాయి మండలం లింగాల గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సన్నాహకాలు, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని తెలిపారు.ప్రతి గ్రామంలో పార్టీ కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని, గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ క్యాడర్‌కు ఐడీ కార్డులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వత్సవాయి మండల పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు ఆంబోజి జీవరత్నం, మండల ప్రచార విభాగం అధ్యక్షులు యేశాల కనకచంద్రరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు పీట్ల మురళి, గ్రామ సీనియర్ నాయకులు పీట్ల జనార్దన్, ఆంబోజి వెంకటేశ్వర్లు, రామారావు, రమేష్, పుల్లారావు, ఉప్పాల వెంకటేశ్వర్లు, చింతల నరసింహరావు, చిట్టూరి రంగారావు, కొండయ్య, పిల్లలమర్రి నరసింహరావుతో పాటు వివిధ హోదాల్లో ఉన్న యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.