చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సాహించాలి : తలసాని సాయి కిరణ్ యాదవ్
సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : విద్యార్థులను చదువుతో పాటు క్రీడలలో కూడా ప్రోత్సహించాలని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ అన్నారు. మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా మోండా డివిజన్ లోని ఆదయ్య నగర్ గ్రౌండ్ లో నిర్వహించిన ఒకరోజు అండర్ 17 బాలురు, బాలికల వాలీబాల్ పోటీలు మంగళవారం రాత్రి ముగిశాయి. ఈ పోటీలకు తలసాని సాయి కిరణ్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బాలుర విభాగంలో 6 టీమ్ లు, బాలికల విభాగంలో 5 టీమ్ లు పోటీలలో పాల్గొన్నాయి. ఈ పోటీలలో బాలుర విభాగంలో మేడ్చల్ లోని సంస్కార్ స్కూల్ టీమ్ మొదటి బహుమతి, కూకట్ పల్లిలోని దేవకుల్ గీతాంజలి స్కూల్ టీమ్ ద్వితీయ బహుమతి ని, బాలికల విభాగంలో ఖైరతాబాద్ లోని నాసర్ స్కూల్ టీమ్ మొదటి బహుమతి, కూకట్ పల్లిలోని దేవకుల్ గీతాంజలి స్కూల్ ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు. వీరికి యువ నాయకులు తలసాని సాయి కిరణ్ యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని మహేష్ యాదవ్ లు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా శ్రద్ధ చూపాలని అన్నారు. పోటీలలో గెలుపు, ఓటములు సహజమని అన్నారు. గెలుపే లక్ష్యంగా శ్రమించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి పోటీలను వేదికగా చేసుకొని తమ నైపుణ్యాన్ని మరింత పెంచుకోవాలని అన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో తలపడేలా కృషి చేయాలని అన్నారు. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా తలసాని ట్రస్ట్ అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రకటించారు. కార్యక్రమంలో రోడ్డు ట్రాన్స్ పోర్ట్ రీజనల్ మేనేజర్ కిరణ్, హైదరాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ మురళి, నిర్వాహకులు ఆదయ్య నగర్ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు దినేష్ ఆనంద్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ విజయానంద్, మల్లేష్ యాదవ్,మేరీ మనీషా తదితరులు ఉన్నారు