BREAKING
నేడు 10వ 'ఇండియా మొబైల్ కాంగ్రెస్'ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ: మోదీని ఎవరూ ఏమీ చేయలేరు: రాహుల్ గాంధీకి హిమంత బిశ్వ శర్మ హెచ్చరిక! పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సాహించాలి : తలసాని సాయి కిరణ్ యాదవ్ కబ్జాదారుల కట్టడాలపై ఇరిగేషన్‌ కొరడా గోదావరిలో దూకిన దుమ్ముగూడెం యువకుడు. శ్రీ దుర్గ నవరాత్రి ఉత్సవాలకు రూ.15 వేల విరాళం బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ కన్నుమూత గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి శాంతిభద్రతల పరిరక్షణే ప్రథమ ప్రాధాన్యం.. కళ్యాణదుర్గం డీఎస్పీ మంత్రి నారాయణను కలిసిన ఎరిక్షన్ బాబు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటిన బ్రేవ్ హాట్స్ కబ్స్ యూనిట్ విద్యార్థులు తాళ్లమాపురానికి రూ.3.50 కోట్ల నిధులు మంజూరు పై జనసేన నాయకుల హర్షం అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన గ్రామ కంఠం భూమిని కాపాడండి

మోదీని ఎవరూ ఏమీ చేయలేరు: రాహుల్ గాంధీకి హిమంత బిశ్వ శర్మ హెచ్చరిక!

Select Suryaa Now
మోదీని ఎవరూ ఏమీ చేయలేరు: రాహుల్ గాంధీకి హిమంత బిశ్వ శర్మ హెచ్చరిక!

సూర్య జాతీయ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశంలో 'సనాతన శక్తి' ఉన్నంత కాలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎవరూ ఎలాంటి హాని తలపెట్టలేరని, ఆయన వెంట్రుక కూడా తాకలేరని (బాల్ భీ బాంకా నహీ కర్ సక్తే) వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాప్రతినిధి ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నిర్వహించిన 'సేవా సంకల్ప అభియాన్' ముగింపు సభలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పాల్గొని ప్రసంగించారు.

సభలో హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. కొందరు వేలాది మందిని సమీకరించి నిరసనలు చేపట్టినంత మాత్రాన ప్రధాని మోదీని ఆపలేరని హెచ్చరించారు. భారత్‌లోని సనాతన ధర్మ ఆశీస్సులు, యావత్ దేశ ప్రజల శక్తి మోదీ వెంటే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో దేశ సరిహద్దులు, రక్షణ వ్యవస్థలు భద్రత లేని స్థితిలో ఉండేవని, కానీ మోదీ నాయకత్వంలో సరికొత్త భారత్ ఆవిర్భవించి శత్రుదేశాల బెదిరింపులను దీటుగా తిప్పికొడుతోందని పేర్కొన్నారు. దేశ సార్వభౌమాధికారం, సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడంలో ప్రధాని దృఢమైన నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు.

రాముడి ఆలయ నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటి చారిత్రక ఘనతలు మోదీ నాయకత్వానికే దక్కుతాయని ఆయన వివరించారు. 2014 నుంచి ప్రజలు వరుసగా మూడోసారి మోదీ ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టడం దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో కీలక మైలురాయి అని, ఇది మోదీ పాలనపై దేశ ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని అస్థిరపరిచేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు సనాతన భారత శక్తి ముందు నిలవలేవని స్పష్టం చేశారు.