బెస్ట్ ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్ గా ప్రసాద్
భారత్ కళా పురస్కార్ – 2026కు అహోబిలం ఫోటోగ్రాఫర్ ఎంపిక
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
హైదరాబాద్ ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో – 2026లో భాగంగా నిర్వహించిన భారత్ కళా పురస్కార్–2026 కార్యక్రమంలో “బెస్ట్ ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్” విభాగానికి అహోబిలానికి చెందిన ప్రసాద్ ఫోటోగ్రఫీని ఎంపిక చేసి, నామినేషన్‌ను ఆమోదించి అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ప్రసాద్ మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగంలో సంప్రదాయ కళ, సంస్కృతి, ఆధ్యాత్మికతకు సంబంధించిన చిత్రాలను తనదైన శైలిలో చిత్రీకరిస్తున్నందుకు ఈ పురస్కారం అందుకోవడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని ప్రసాద్ తెలిపారు.హైదరాబాద్‌లో నిర్వహించిన ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో–2026లో పాల్గొని భారత్ కళా పురస్కార్–2026ను అందుకోవడం తనకు ప్రత్యేక అనుభూతిని కలిగించిందని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా అవార్డు కార్యక్రమానికి సహకరించిన ఎడిట్ పాయింట్, వందే భారత్, పీపీఐఎన్ – ఫోటో పరివార్ ఇండియా నెట్‌వర్క్ వారికి ఆయనహృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ సహకారం అందించడం జరిగిందన్నారు.