BREAKING
ఆస్ట్రేలియా రాజకీయాల్లో సంచలనం వలసల కోతపై ప్రతిపక్షం కీలక ప్రకటన డీఎంజీ సరిహద్దు పేలుడు ఘటన తీవ్రత ఉత్తర కొరియా బేషరతు క్షమాపణ కోరేలా దక్షిణ కొరియా వ్యూహం 2029 నాటికి ప్రభుత్వ బడులన్నీ 4-స్టార్ స్థాయికి: ఆర్చరీ గోల్డెన్ గర్ల్ జ్యోతి సురేఖకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు ఐపీవో జీఎంపీ ట్రెండ్: ఎస్‌ఆర్‌ఐటీ ఇండియా వర్సెస్ షా ఇన్వెస్టర్స్ హోమ్.. లిస్టింగ్ లాభాల్లో ఏది ముందంజ? రియాద్ ఎయిర్‌పోర్ట్, ఆరామ్‌కో రిఫైనరీలపై భారీ దాడులు: ఎన్నికల కమిషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ నిరసన. బెస్ట్ ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్ గా ప్రసాద్ ఫ్లైదుబాయ్ విమానంపై దాడి వెనుక ఇరాన్ హస్తం: డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు అలాస్కా గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు జేడీ వాన్స్ పూర్తి మద్దతు: ఆసియా మార్కెట్లకు ఎల్‌ఎన్‌జీ ఎగుమతులే లక్ష్యం అమెరికా-జపాన్ సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం: ఈసీఎల్‌జీఎస్ 5.0 కింద బ్యాంక్ రుణాల విడుదలను వేగవంతం చేయండి: జుట్టు రాలే సమస్య, చుండ్రుతో బాధపడుతున్నారా? ఈ సులభమైన ఇంటి చిట్కాలతో శాశ్వత పరిష్కారం! డిజిటల్ భారత్‌లో సరికొత్త రికార్డు: 109 కోట్లు దాటిన ఇంటర్నెట్ వినియోగదారులు.. ట్రాయ్ వార్షిక నివేదికలో వెల్లడి! చర్మానికి ఇన్స్టంట్ గ్లో రావాలా? పసుపు ఐస్ క్యూబ్స్‌తో ఇలా మ్యాజిక్ చేయండి!

వాకలపుడిలో గాలి 219! ఇప్పుడు ఎంత?

Select Suryaa Now
వాకలపుడిలో గాలి 219! ఇప్పుడు ఎంత?

వాకలపూడి గాలిలో ‘219’.. ఇప్పుడు ఎంత?

పీఎం10 పరిమితి 100.. అధికారిక పరీక్షల్లో 219

నివేదికలు రావాల్సి ఉందంటూనే పీజీఆర్ఎస్‌ ఫిర్యాదు ‘అటెండెడ్‌’

రెండు రోజులకే సూర్యకళ సంతకంతో సంబంధిత సంస్థకు నోటీసు

రూ.4.44 కోట్ల పర్యావరణ పరిహారంపై రాష్ట్ర బోర్డు షోకాజ్‌

ప్రజలు పీల్చే గాలి నాణ్యత చెప్పేదెవరు?

ఉమ్మడి గోదావరి జిల్లాల ‘సూర్య’ బ్యూరో — కాకినాడ

వాకలపూడిలో నిర్వహించిన అధికారిక పరీక్షల్లో పీఎం10 పరిమితి 100 కాగా 219 వరకు నమోదైంది. మరోచోట 140, మొబైల్‌ మానిటరింగ్‌లో 167గా తేలింది. ప్రాంగణంలోని పీజోవెల్‌ నమూనాల్లోనూ సీసం, కాడ్మియం, మాంగనీస్‌ సహా పలు పరామీటర్లలో అధిక విలువలను ఏపీపీసీబీ నమోదు చేసింది.

నివేదికలు రావాల్సి ఉందంటూనే..

గ్రీన్‌ పీస్‌ అథారిటీ ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్‌ ఆదేశాలతో మే 18న అధికారులు తనిఖీ చేసి నమూనాలు సేకరించారు. పరీక్షా నివేదికలు ఇంకా రావాల్సి ఉందని పేర్కొంటూనే ఏపీపీసీబీ కాకినాడ ప్రాంతీయ కార్యాలయ పర్యావరణ ఇంజినీర్‌ ఇలపండ సూర్యకళ జూన్‌ 3న పీజీఆర్ఎస్‌ ఫిర్యాదును ‘అటెండెడ్‌’గా పరిగణించారు. అదే జూన్‌ 3 తేదీతో వచ్చిన ల్యాబ్‌ ఫలితాల్లో పీఎం10 219 సహా పలు విలువలు ప్రమాణాలు దాటినట్లు నమోదైంది. రెండు రోజుల తర్వాత జూన్‌ 5న సూర్యకళ సంతకంతో సంబంధిత సంస్థకు నోటీసు జారీ అయింది. కానీ పరీక్షల ఫలితాలు, నోటీసు సమాచారం ఫిర్యాదుదారుడికి చేరలేదు.

ఆగస్టు 29న ఫిర్యాదును తిరిగి తెరిచిన తర్వాత సెప్టెంబరు 28న జోనల్‌ కార్యాలయం ఇచ్చిన ఎండార్స్‌మెంట్‌తో ఈ వివరాలు ఫిర్యాదుదారుడి దృష్టికి వచ్చాయి. మరోవైపు ఆగస్టు 8న రాష్ట్ర ఏపీపీసీబీ ప్రధాన కార్యాలయం అమ్మోనియా 23 సందర్భాల్లో, హైడ్రోజన్‌ ఫ్లోరైడ్‌ 46 సందర్భాల్లో పరిమితులు దాటినట్లు పేర్కొంటూ రూ.4.44 కోట్ల పర్యావరణ పరిహారం ఎందుకు విధించకూడదో సంబంధిత సంస్థకు షోకాజ్‌ ఇచ్చింది.

‘219’ తర్వాత ఏం చేశారు?

పీఎం10 219 నమోదైన తర్వాత ఏ చర్యలు చేపట్టారు? నోటీసు తర్వాత లోపాలు సరిదిద్దారా? మళ్లీ గాలి, నీటి నమూనాలు పరీక్షించారా? ఇప్పుడు అక్కడి గాలి నాణ్యత ఎంత? పీజీఆర్ఎస్‌ ఫిర్యాదును పరిష్కరించిన తీరుపై సూర్యకళ నుంచి లిఖితపూర్వక వివరణ తీసుకోవడంతో పాటు ఈ వివరాలను రికార్డులతో పరిశీలించాలని సెప్టెంబరు 29న ఫిర్యాదుదారుడు కలెక్టర్‌ను కోరారు.

ఫిర్యాదుదారుడికే పరీక్షల ఫలితాలు, నోటీసు సమాచారం చేరని పరిస్థితిలో అక్కడి ప్రజలకు తాము పీల్చే గాలి నాణ్యత ఎలా తెలుస్తుంది? కాకినాడలో రియల్‌టైమ్‌ గాలి నాణ్యత పర్యవేక్షణ అందుబాటులోకి రావాలి. ఆ వివరాలు ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియాలి.