BREAKING
దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో భారీగా మోహరించిన భద్రతా బలగాలు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ రేసులో ఇండోనేషియా అభ్యర్థి అమెరికా మళ్లీ సంస్థలో చేరాలని పిలుపు అమెరికాలో వైద్య రంగానికి 3బిలియన్ డాలర్లు ప్రకటించిన బెక్షన్ డికిన్సన్ ఆస్ట్రేలియా రాజకీయాల్లో సంచలనం వలసల కోతపై ప్రతిపక్షం కీలక ప్రకటన డీఎంజీ సరిహద్దు పేలుడు ఘటన తీవ్రత ఉత్తర కొరియా బేషరతు క్షమాపణ కోరేలా దక్షిణ కొరియా వ్యూహం 2029 నాటికి ప్రభుత్వ బడులన్నీ 4-స్టార్ స్థాయికి: ఆర్చరీ గోల్డెన్ గర్ల్ జ్యోతి సురేఖకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు ఐపీవో జీఎంపీ ట్రెండ్: ఎస్‌ఆర్‌ఐటీ ఇండియా వర్సెస్ షా ఇన్వెస్టర్స్ హోమ్.. లిస్టింగ్ లాభాల్లో ఏది ముందంజ? రియాద్ ఎయిర్‌పోర్ట్, ఆరామ్‌కో రిఫైనరీలపై భారీ దాడులు: ఎన్నికల కమిషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ నిరసన. బెస్ట్ ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్ గా ప్రసాద్ ఫ్లైదుబాయ్ విమానంపై దాడి వెనుక ఇరాన్ హస్తం: డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు అలాస్కా గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు జేడీ వాన్స్ పూర్తి మద్దతు: ఆసియా మార్కెట్లకు ఎల్‌ఎన్‌జీ ఎగుమతులే లక్ష్యం అమెరికా-జపాన్ సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం: ఈసీఎల్‌జీఎస్ 5.0 కింద బ్యాంక్ రుణాల విడుదలను వేగవంతం చేయండి:

ఎన్నికల కమిషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ నిరసన.

Select Suryaa Now
ఎన్నికల కమిషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ నిరసన.

 

కళ్యాణదుర్గం టౌన్ ప్రతినిధి :-

 

భారత ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న పలు నిర్ణయాలను నిరసిస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. అక్టోబర్ 7వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు కళ్యాణదుర్గం పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేయడంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాహుల్ గాంధీ, రఘువీరారెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఉదయం 11 గంటలకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కరణం భవన్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, స్వర్గీయ మాల ఎర్రిస్వామి సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన సేవలను స్మరించుకుంటూ నిర్వహించే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై నివాళులు అర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఒకే రోజు నిర్వహించనున్న నిరసన ర్యాలీ, సంస్మరణ సభ కార్యక్రమాల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కళ్యాణదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోరింది.