నేడు వికారాబాద్‌లో భారీ నిరసన ర్యాలీ:డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ నాయక్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్( అక్టోబర్ 6):ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో అర్హులైన పేద ప్రజల ఓట్లను తొలగించే చర్యలను నిరసిస్తూ ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ చేపడుతున్న ఈ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
మధ్యాహ్నం 3 గంటలకు ఎన్‌టీఆర్ చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభమై బీజేఆర్ చౌరస్తా మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామమోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో పాటు సీపీఐ, సీపీఎం, ఎస్పీ, టీజేఎస్ పార్టీల జిల్లా అధ్యక్షులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.ర్యాలీలో జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ కమిటీల చైర్మన్లు, మండల, టౌన్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, సహకార సంఘాల ప్రతినిధులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ధారాసింగ్ నాయక్ కోరారు.
“అర్హులైన ప్రతి ఓటును కాపాడుదాం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం” అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి.