పరామర్శించిన ముదునూరి ప్రసాద్ రాజు
ముదునూరిమురళి కృష్ణంరాజును పరామర్శించిన ముదునూరి ప్రసాదరాజు
ప్రత్తిపాడుమేజర్ న్యూస్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణంరాజును నరసాపురం జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ చీప్ విప్ ముదునూరి ప్రసాదరాజు పరామర్శించారు. ఆదివారం ధర్మవరంలో మురళీకృష్ణంరాజు నివాసంలో ఇటీవల కాలంలో మురళి కృష్ణంరాజు తండ్రి రామరాజు మృతి చెందడంతో రామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రసాదరాజు మాట్లాడుతూ రామరాజు మృతి తీరని లోటు అని ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు .మురళి రాజు కుటుంబ సభ్యులను పలు జిల్లాల నాయకులు, నియోజకవర్గంలో పార్టీలకతీతంగా నాయకులు ప్రజలు మురళి కృష్ణంరాజు పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో కోలా తాతబాబు, పోకనాటి వెంకటేశ్వరరావు, జువ్వల దొరబాబు, శెట్టి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.