BREAKING
చకోర వేడుక: మీరూ మరో పూరి, శివ నిర్వాణ కాగలరు! నేడు స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ భారత పర్యటన పెగ్గెర్ల గ్రామానికి నూతన విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు బిగ్‌బాస్ హౌస్‌లో సంచలనం.. ఊహించని విధంగా ఆమె ఎలిమినేషన్.. సండే ఎపిసోడ్ హైలైట్స్ ఇవే! ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కృతఙ్ఞతలు తెలిపిన నూతన పాక్స్ చైర్మన్లు కలిగోట సూరమ్మ ప్రాజెక్టు ను సందర్శించిన బిజెపి కిమోరా అధికార ప్రతినిధి కోడిపల్లి Gold Rates Today: గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే? భారత రైతులకు ఏఐ ద్వారా సరికొత్త సాధికారత: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ట్రంప్ పదవీకాలం ముగిసినా ఇరాన్ యుద్ధ సంక్షోభం కొనసాగే ప్రమాదం బ్రిటన్ రాజకీయాల్లో సంచలనం ఎన్‌‌సీసీ క్యాడెట్లకు భారత సైన్యం ప్రత్యేక శిక్షణ కరీబియన్‌లో అమెరికా సైనిక దాడి రక్షణ కమ్యూనికేషన్ రంగంలో భారత్ సరికొత్త మైలురాయి చైనా కోసం గూఢచర్యం చేసిన కాలిఫోర్నియా మహిళ అరెస్ట్ భూమికోసం ఆగిన రైతు గుండె..!

ఎమ్మెల్యే లారీలకు టోల్ రుసుం ఎందుకు కట్టాలి?

Select Suryaa Now
ఎమ్మెల్యే లారీలకు టోల్ రుసుం ఎందుకు కట్టాలి?

                                            వెదురుపావులూరు వద్ద నిలిచిన వాహనాలు.. పోలీసుల జోక్యం
సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెదురుపావులూరు టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తీవ్ర ఉద్రిక్తత, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార దర్పం ప్రదర్శిస్తూ నిబంధనలకు విరుద్ధంగా టోల్ ఫీజు చెల్లించేందుకు నిరాకరించడంతో ఒకేసారి ఏకంగా 18 భారీ లారీలు టోల్‌గేట్ వద్ద నిలిచిపోయాయి. ఏలూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి వైపు వెళ్తున్న ఈ వాహనాలు ఏలూరు జిల్లాకు చెందిన ఓ కీలక శాసనసభ్యుడికి (ఎమ్మెల్యే) చెందినవిగా ప్రచారం జరుగుతుండటంతో ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

టోల్‌గేట్ వద్దకు చేరుకున్న సమయంలో టోల్ సిబ్బంది రుసుము చెల్లించాలని కోరగా, లారీల డ్రైవర్లు అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. ఇవి స్థానిక ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే గారికి చెందిన వాహనాలని, వీటికి టోల్ రుసుం చెల్లించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ లారీలను టోల్ బూత్‌ల ముందే వరుసగా నిలిపివేశారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిబ్బంది ఎంత నచ్చజెప్పినప్పటికీ డ్రైవర్లు వాహనాలను అక్కడి నుంచి కదిలించకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ ప్రతిష్టంభనపై సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుండటాన్ని గమనించిన పోలీసులు లారీ డ్రైవర్లతో చర్చలు జరిపారు. జాతీయ రహదారుల నిబంధనల ప్రకారం వాణిజ్య వాహనాలకు టోల్ మినహాయింపు ఉండదని, ముందుగా టోల్ రుసుం చెల్లించి మార్గాన్ని క్లియర్ చేయాలని ఆదేశించారు. చెల్లించిన మొత్తానికి రసీదులు తీసుకుని సంబంధిత యజమాన్యం లేదా కాంట్రాక్ట్ సంస్థ నుంచి ఆ డబ్బులను తిరిగి వసూలు చేసుకోవాలని డ్రైవర్లకు పోలీసులు స్పష్టమైన సూచనలు చేశారు. పోలీసుల జోక్యంతో డ్రైవర్లు టోల్ చెల్లించడంతో వాహనాలు ముందుకు సాగి రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి.