నాలుగు దశాబ్దాల సేవకు ... ఆత్మీయ వీడుకోలు
నాలుగు దశాబ్దాల సేవకు.. ఆత్మీయ వీడ్కోలు
పారిశుధ్య సేవల్లో చెరగని ముద్ర వేసిన సత్తప్ప నాయుడు
సహచరులతో మమేకమై సాగిన సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానం
దంపతులను గజమాలతో సత్కరించిన పారిశుధ్య సిబ్బంది
కాకినాడ మేజర్ న్యూస్
నాలుగు దశాబ్దాల ఉద్యోగ ప్రస్థానం.. నగర పారిశుధ్య నిర్వహణలో నిరంతర సేవ.. సహచరులతో ఆత్మీయ అనుబంధం.. శానిటేషన్ సూపర్‌వైజర్ గుండుబోగుల సత్తప్ప నాయుడు ఉద్యోగ విరమణ సందర్భంగా సహచరులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదివారం ఐలమ్మ రజక కమ్యూనిటీ హాల్లో రెండో సర్కిల్ నుంచి 13వ సర్కిల్ వరకు పనిచేస్తున్న శానిటేషన్ సెక్రటరీలు, మేస్త్రీలు, పారిశుధ్య కార్మికుల ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ ఇమిడిశెట్టి వెంకటరమణ అధ్యక్షత వహించారు.
ఒత్తిడి పనిపై పడనివ్వొద్దు
విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని పనిపై పడనివ్వకుండా బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని సత్తప్ప నాయుడు సూచించారు. తన ఉద్యోగ జీవితంలో సహకరించిన అధికారులు, సిబ్బంది, కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా అంకితభావంతో పనిచేస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్నారని పలువురు కొనియాడారు. అనంతరం సత్తప్ప నాయుడు దంపతులను గజమాలతో సత్కరించారు.
కార్యక్రమంలో కార్పొరేషన్ అకౌంటెంట్ జయరాం, హెల్త్ సూపరింటెండెంట్ రామశాస్త్రి, వడిసిలేరు దాలమ్మ, మళ్లిపూడి కుమార్, దేవు జయలక్ష్మి, గుమ్మల చిన్న, పెన్నమరెడ్డి బుజ్జి, బొల్లోజు ఉమామహేశ్వరరావు, కలదిండి సురేష్ తదితరులు పాల్గొన్నారు.