BREAKING
బ్రెజిల్‌లో అత్యంత ఉత్కంఠభరితంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్, తీవ్రంగా ముగిసిన తొలి విడత పెమ్మసాని పొలిటికల్ హీరో: సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం భారతీయ స్టాక్ మార్కెట్లలో పుంజుకున్న జోరు అంతర్జాతీయ మార్కెట్లో పుంజుకున్న పసిడి ధరలు కరెన్సీ మార్కెట్లో డాలర్ జోరు, ఫ్రాన్స్ ఆర్థిక సమస్యలతో వెనుకబడిన యూరో ఏపీలో తల్లికి వందనం రెండో విడత : నిధుల విడుదలపై ప్రభుత్వం కసరత్తు.. గ్లోబల్ మార్కెట్లలో ఊరట, డాలర్ పతనం మధ్య లాభాల బాటలో స్టాక్ సూచీలు ఏపీ అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కెనడా ఇంధన రంగంలో సంచలనం, భారీ ఆస్తులను విక్రయించిన సన్‌కోర్ ఎనర్జీ ఏపీలో 3 లక్షల పేదల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం ఎమ్మెల్యే లారీలకు టోల్ రుసుం ఎందుకు కట్టాలి? అమెరికాలో కలకలం, చైనా కోసం గూఢచర్యం చేసిన కాలిఫోర్నియా మహిళ అరెస్ట్ పాలకొల్లులో విద్యార్థులకు ఉచితంగా 250 సైకిళ్ల పంపిణీ అమెరికాలో తైవాన్ కొత్త కార్యాలయం ప్రారంభం, పర్యటనపై చైనా ఆగ్రహం అమెరికాలో నాంటకెట్ తీరంలో కూలిన మెడికల్ విమానం

కంటి వెలుగుకి సేవా సంకల్పం

Select Suryaa Now
కంటి వెలుగుకి సేవా సంకల్పం

*కంటి వెలుగుకు ‘సేవా సంకల్పం’*

* కాకినాడలో 200 మందికి ఉచిత కంటి వైద్య సేవలు

* శ్రీకరం కంటి ఆసుపత్రి సౌజన్యంతో వైద్య శిబిరం

* బీజేపీ సిటీ వెస్ట్‌ మండలం ఆధ్వర్యంలో నిర్వహణ

* శిబిరాన్ని ప్రారంభించిన సాలగ్రామ లక్ష్మీప్రసన్న, బిక్కిన విశ్వేశ్వరరావు

కాకినాడ మేజర్ న్యూస్

సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా కాకినాడలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. రాజాజీ వీధి నెల్లి అప్పన్న సెంటర్‌ వద్దనున్న అమ్మగారు ఆశ్రమంలో బీజేపీ కాకినాడ సిటీ వెస్ట్‌ మండల అధ్యక్షుడు దొడ్డి వీరేంద్ర ఆధ్వర్యంలో, శ్రీకరం కంటి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన శిబిరంలో సుమారు 200 మందికి ఉచితంగా కంటి పరీక్షలు, వైద్య సేవలు అందించారు.

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీప్రసన్న, బిక్కిన విశ్వేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు ఉపయోగపడే కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని లక్ష్మీప్రసన్న పేర్కొన్నారు. సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా కాకినాడ నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు బిక్కిన విశ్వేశ్వరరావు తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ నాయకులు పైడా కృష్ణమోహన్‌, తుమ్మల పద్మజ, యెనిమిరెడ్డి మాలకొండయ్య, గట్టి సత్యనారాయణ, పైడా భవానీప్రసాద్‌, యార్లగడ్డ రామకుమార్‌, చోడిశెట్టి రమేష్‌బాబు, కుండల సాయి, ఘంటసాల గోవిందరాజు, మారే బుజ్జి, చెక్క రమేష్‌, దొడ్డి అప్పలరాజు, నాగులకొండ భద్రినారాయణ, దొడ్డి శ్రీదుర్గ, పోలవరపు వరలక్ష్మి, గొల్లపల్లి శివతో పాటు కూటమి నాయకులు చక్రపాణి, కాకి శ్రీను, మవులూరి సురేష్‌, రాజు, రంగ, అబ్బాయి తదితరులు పాల్గొన్నారు.