BREAKING
మహిళలకు ఉచిత మగ్గం వర్క్ శిక్షణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం మసీదులో నమాజ్‌కు రాజకీయాలతో సంబంధం లేదు.. అన్నారంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ద్వారకామాయి కాలనీ అభివృద్ధికి రూ.23 లక్షలతో సీసీ రోడ్డు మంజూరు చొల్లవీడు పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి బత్తిని చిన్న రంగమ్మ ఏకగ్రీవ ఎన్నిక గంగవరంలో ఎల్లంపల్లి మురళి ఘన విజయం 1,080 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. ఉపసర్పంచ్‌గా శ్రావణి ఎన్నిక బిర్యానీ తినాలంటూ పరిచయం.. నిర్మానుష్య ప్రాంతంలో బెదిరించి దోపిడీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డిని సన్మానించిన కూర్మాయి సర్పంచ్ విజయ మిట్స్ వర్సిటీ నూతన వీసీగా ప్రొఫెసర్ సరాజు పి.మొహంతి నియామకం : నాణ్యమైన విద్య,ఉపాధి అవకాశాల కల్పనే ప్రధాన లక్ష్యమని వెల్లడి : శుభాకాంక్షలు తెలిపిన ఛాన్సల్లర్ ఎన్.విజయ్ భాస్కర్ చౌదరి సోమీదేవిపల్లి పంచాయతీలో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక ఖమ్మం నగరంలో పలు వివాహ శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..* 2025–26లో 378.5 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రాజ్యాంగంతోనే సమాన అవకాశాలు బ్రెజిల్ ఆర్థిక చర్యలపై లూలాతో ఆర్థిక మంత్రి భేటీ

ఏపీ అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

Select Suryaa Now
ఏపీ అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ఒక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాధ్యమని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించనున్న పైలట్ గృహ నిర్మాణ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు విజనరీ నాయకత్వంలో రాష్ట్రం వేగవంతమైన ప్రగతి పథంలో దూసుకుపోతోందని, ఆయన ఆలోచనా విధానం, పాలనా దక్షత దేశానికే ఆదర్శప్రాయమని కేంద్ర మంత్రి కొనియాడారు.

దేశంలో సాంకేతిక విప్లవాన్ని పాలనతో అనుసంధానం చేయడంలో చంద్రబాబు ఎల్లప్పుడూ ముందుంటారని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్రస్థానంలో నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుందని, ఇప్పుడు మరోసారి అత్యాధునిక నిర్మాణ సాంకేతికతలను పేదల సంక్షేమానికి వినియోగిస్తూ దేశానికే సరికొత్త దిశానిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేస్తూ ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా గృహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ తరహాలో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాయని తెలిపారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాల విస్తరణకు అవసరమైన నిధులను, సహాయాన్ని కేంద్రం నిరంతరం అందిస్తుందని, చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అతి త్వరలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.