అత్యంత వైభవంగా శ్రీ సత్యదేవుని రథసేవ
అత్యంత వైభవంగా శ్రీ సత్యదేవుని రథ సేవ
అన్నవరం, అక్టోబర్ 4, ఆదివారం:
కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో ఆదివారం శ్రీ సత్యదేవుని రథ సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ వైదిక సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి రథ సేవను ఘనంగా చేపట్టారు.
రథ సేవలో పాల్గొనేందుకు భక్తులు టికెట్లు తీసుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారి ఉత్సవమూర్తులను రథంపై అధిష్ఠింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథ సేవ ప్రారంభమైంది.
భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రథంతో పాటు పాల్గొని రాజగోపురం చుట్టూ ప్రదక్షిణ చేశారు. స్వామివారి రథ సేవను దర్శించుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రథ సేవ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.
ఈ రథ సేవలో ఆలయ వేద పండితులు, అర్చకులు, దేవస్థానం అధికారులు, పాలకమండలి సభ్యులు, సిబ్బంది, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.