BREAKING
ఎమ్మెల్యే లారీలకు టోల్ రుసుం ఎందుకు కట్టాలి? అమెరికాలో కలకలం, చైనా కోసం గూఢచర్యం చేసిన కాలిఫోర్నియా మహిళ అరెస్ట్ పాలకొల్లులో విద్యార్థులకు ఉచితంగా 250 సైకిళ్ల పంపిణీ అమెరికాలో తైవాన్ కొత్త కార్యాలయం ప్రారంభం, పర్యటనపై చైనా ఆగ్రహం అమెరికాలో నాంటకెట్ తీరంలో కూలిన మెడికల్ విమానం పరాగ్వే రాజధాని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న విపక్షం అమెరికాలో కాల్పుల కలకలం స్థానిక సంస్థల ఎన్నికలపై సింగనమలలో మండలస్థాయి సన్నాహక సమావేశం కార్పొరేషన్ ఎన్నికల్లో చేనేత వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి ఎమ్మెల్యే దగ్గుపాటికి చేనేత కార్మికుల ఐక్య వేదిక వినతి 2047 నాటికి 'వికసిత్ భారత్' సాధ్యమే: 5 కీలక ప్రాధాన్యతలను వెల్లడించిన ప్రధాని ముఖ్య కార్యదర్శి-2 శక్తికాంత దాస్ మంచిర్యాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భిణీ మృతి.. నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు పెట్టుబడులతో పౌరసత్వం: సరికొత్త ఆఫర్ ప్రకటించిన అర్జెంటీనా కార్తీకమాసం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నేడు యధావిధిగా పీజీఆర్ఎస్ అమలాపురం అయ్యప్ప స్వామి ఆలయంలో 72 రోజుల పాటు ఉచిత బిక్ష: 16న మహాకుంభాభిషేకం

Rangullo medicine

Select Suryaa Now
Rangullo medicine

రంగుల్లో మెరిసిన భారతం!

విద్యార్థుల రంగోలిలో రూపుదిద్దుకున్న దేశ పటం

మోదీ 76వ జన్మదిన సేవా కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణ

పీఆర్‌జీ జూనియర్‌ కళాశాల విద్యార్థుల సృజనాత్మకత

కాకినాడ బాలాజీ చెరువు సెంటర్‌లో ‘రంగోలి దేశం’

కాకినాడ మేజర్ న్యూస్

రంగులద్దుకున్న భారతదేశ పటం.. విద్యార్థుల చేతుల్లో రూపుదిద్దుకున్న దేశభక్తి భావన.. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్‌లోని పీఆర్‌జీ జూనియర్‌ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ‘రంగోలి దేశం’ కార్యక్రమం ఆకట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు భారతదేశ పటాన్ని రంగోలిగా తీర్చిదిద్దారు.

బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు సూచనల మేరకు సిటీ వెస్ట్‌ మండల అధ్యక్షుడు దొడ్డి వీరేంద్ర అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ‘రంగోలి దేశం’ జిల్లా ఇన్‌ఛార్జులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఏడిద కృష్ణ, వెలుగుల గోపాలకృష్ణ ఆధ్వర్యంలో, కళాశాల ప్రిన్సిపల్‌ జ్యోతుల రాంబాబు పర్యవేక్షణలో విద్యార్థులు రంగోలిని రూపొందించారు.

మోదీ పాలనా ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ..

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, అనంతరం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సాగించిన పాలనా ప్రయాణాన్ని ఈ సందర్భంగా నాయకులు ప్రస్తావించారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, అభివృద్ధి లక్ష్యంగా ఆయన నాయకత్వం కొనసాగుతోందని పేర్కొన్నారు.

కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీప్రసన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి యార్లగడ్డ రామకుమార్‌, యెనిమిరెడ్డి మాలకొండయ్య, గట్టి సత్యనారాయణ, చోడిశెట్టి రమేష్‌, మెడ విజయలక్ష్మి, చెక్క రమేష్‌, గోడి సత్యవతి, వంక మాలతి, ధనరాజ్‌ భార్గవ్‌, రాచర్ల చిన్ని, మట్ట లక్ష్మణ్‌, శ్రీమంతుల బాబ్జి, శ్రీకాంత్‌తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.