నాణ్యత లోపంతో పాడైన రోడ్డును పరిశీలించిన చిర్ల జగ్గిరెడ్డి...
అమలాపురం మేజర్ న్యూస్ ఈదరపల్లి ముక్కామల ప్రధాన రహదారి బ్రిడ్జి నుండి కాలవ గట్టు మీద వేసిన రోడ్డు నెలల వ్యవధిలోనే పాడైపోవడంపై అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిపరిశీలించారు
.సరైన రివిట్మెంట్ వర్క్ లేకుండా, నాణ్యత లోపంతో రోడ్డు నిర్మాణం చేపట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ప్రజాధనం వృథా అయిందని విమర్శించారు. దెబ్బతిన్న రోడ్డు వల్లవాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీను , అమలాపురం నియోజకవర్గ పరిశీలకులు కటకంశెట్టి ఆదిత్య,sec సభ్యురాలు కాశి బాలమునికుమారీ, వాసంశెట్టి తాతాజీ , దొమ్మేటి రాము , గొవ్వల రాజేష్ , దొమ్మేటి సత్య మోహన్ ,మండల అధ్యక్షులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు