గుంతలో పడితే అంతే
గుంత లో పడితే అంతే..
ప్రమాదకరంగా రహదారిపై గుంత
ప్రత్తిపాడు మేజర్ న్యూస్
మండల పరిధిలోని ఉత్తరకంచి గ్రామంలో ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంత ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో కాస్త ఆదమరిస్తే చాలు, ప్రమాదాల బారిన పడక తప్పడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు నడిబొడ్డున ఉన్న ఈ గుంత కారణంగా పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, ముఖ్యంగా రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదమరిస్తే ప్రమాదం తప్పదని భావిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.