BREAKING
కెనడా ఇంధన రంగంలో సంచలనం, భారీ ఆస్తులను విక్రయించిన సన్‌కోర్ ఎనర్జీ ఏపీలో 3 లక్షల పేదల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం ఎమ్మెల్యే లారీలకు టోల్ రుసుం ఎందుకు కట్టాలి? అమెరికాలో కలకలం, చైనా కోసం గూఢచర్యం చేసిన కాలిఫోర్నియా మహిళ అరెస్ట్ పాలకొల్లులో విద్యార్థులకు ఉచితంగా 250 సైకిళ్ల పంపిణీ అమెరికాలో తైవాన్ కొత్త కార్యాలయం ప్రారంభం, పర్యటనపై చైనా ఆగ్రహం అమెరికాలో నాంటకెట్ తీరంలో కూలిన మెడికల్ విమానం పరాగ్వే రాజధాని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న విపక్షం అమెరికాలో కాల్పుల కలకలం స్థానిక సంస్థల ఎన్నికలపై సింగనమలలో మండలస్థాయి సన్నాహక సమావేశం కార్పొరేషన్ ఎన్నికల్లో చేనేత వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి ఎమ్మెల్యే దగ్గుపాటికి చేనేత కార్మికుల ఐక్య వేదిక వినతి 2047 నాటికి 'వికసిత్ భారత్' సాధ్యమే: 5 కీలక ప్రాధాన్యతలను వెల్లడించిన ప్రధాని ముఖ్య కార్యదర్శి-2 శక్తికాంత దాస్ మంచిర్యాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భిణీ మృతి.. నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు పెట్టుబడులతో పౌరసత్వం: సరికొత్త ఆఫర్ ప్రకటించిన అర్జెంటీనా కార్తీకమాసం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

వైసీపీకి షాక్ ఇచ్చిన కూటమి. ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో వైసీపీ నుండి కూటమిలోకి పలువురు చేరిక.

Select Suryaa Now
వైసీపీకి షాక్ ఇచ్చిన కూటమి. ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో వైసీపీ నుండి కూటమిలోకి పలువురు చేరిక.

అనపర్తి మేజర్ న్యూస్. అనపర్తి మండలం పెడపర్తి గ్రామంలో వైసీపీకి చెందిన 36 కుటుంబాలు టీడీపీ, బీజేపీ కూటమిలో చేరాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలకు టీడీపీ, బీజేపీ కండువాలు కప్పి కూటమిలోకి ఆహ్వానించారు.టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి కొవ్వూరి కొండారెడ్డి, రామవరపు నాగూర్, తాడి వెంకటకృష్ణారెడ్డి, షేక్ సుభాన్ సాయిబ్, అనుపోజు వెంకట శ్రీనివాసుతో పాటు మరో 21 కుటుంబాలను టీడీపీలోకి ఆహ్వానించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మల్లిడి వెంకటేశ్వరరెడ్డి, తాడి వెంకటకృష్ణారెడ్డి, దొండపాటి విజయ్‌కుమార్, సత్తి శేషారత్నం, మేడపాటి ఆదిరెడ్డితో పాటు మరో ఐదు కుటుంబాలను బీజేపీలోకి ఆహ్వానించారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ  పెడపర్తి గ్రామంలో టీడీపీ, బీజేపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సమన్వయంతో ముందుకు సాగుతోందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

అనపర్తి నియోజకవర్గంలో గత రెండేళ్లలో సుమారు రూ.1,200 కోట్ల అభివృద్ధి పనులు సాధించినట్లు తెలిపారు. అనపర్తి ఏరియా ఆసుపత్రికి సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ.80 లక్షల విలువైన సదుపాయాలు సమకూరాయని చెప్పారు. జన్మభూమి రైలుకు అనపర్తిలో హాల్ట్‌ సాధించడం ద్వారా ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలుగుతోందన్నారు.పెడపర్తిలో టీడీపీ, బీజేపీకి మరింత బలాన్ని చేకూర్చేలా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని, భవిష్యత్‌లో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకునేలా కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ టీడీపీ అబ్జర్వర్ పర్వతనేని సురేష్‌తో పాటు నియోజకవర్గ, మండల, పెడపర్తి గ్రామానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.