ఎస్ఐఆర్ లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నిరసన
సూర్య జగిత్యాల ప్రతినిధి: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష ధోరణికి నిరసనగా ఎస్ఐఆర్ లో జరిగిన అక్రమాలపై జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, డిసిసి అధ్యక్షుడు గాజేంగి నందయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, నాయకులు బండ శంకర్, ముజీబ్, తదితరులు పాల్గొన్నారు.