మార్కాపురం జిల్లా డీఆర్వోగా శ్రీదేవి
- ఏలూరు జిల్లా నుంచి బదిలీ
గతంలో గిద్దలూరు, కొమరోలు తహసీల్దార్‌గా సేవలు
మార్కాపురం, మేజర్ న్యూస్ :
మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా (డీఆర్వో) ఎం. శ్రీదేవిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్, డీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఎం. శ్రీదేవిని మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇచ్చారు. తనకు మంజూరైన ఎర్న్డ్ లీవ్ పూర్తయిన అనంతరం కొత్తగా కేటాయించిన పదవిలో ఆమె చేరాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఎం. శ్రీదేవి గతంలో గిద్దలూరు, కొమరోలు మండలాల తహసీల్దార్‌గా కూడా విధులు నిర్వహించారు. మార్కాపురం జిల్లాలో రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించే కీలక బాధ్యతలను ఆమె చేపట్టనున్నారు. సంబంధిత అధికారులు వెంటనే అవసరమైన చర్యలు చేపట్టి, ఆమె రిలీవ్, జాయినింగ్ తేదీలను ప్రభుత్వానికి తెలియజేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.