రాయించెరువులో సాగునీరు నింపాలి - బీజేపీ నేతల డిమాండ్.
రాయించెరువులో సాగునీరు నింపాలి
- బీజేపీ నేతల డిమాండ్.
వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామంలోని రాయించెరువులో (9వ) ప్యాకేజీ కింద సాగునీరు నింపి పనులు పూర్తి చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షుడు మాలోతు లక్పతి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో కలిసి రాయించెరువు నుంచి వీర్నపల్లి మండల కేంద్రానికి పాదయాత్ర తో చేరుకుని మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ.. 9వ ప్యాకేజీ పరిధిలోని రాయించెరువును ఎందుకు పెండింగ్‌లో ఉంచుతున్నారని ప్రశ్నించారు. రాయించెరువులో సాగునీరు నింపకపోవడంతో పరిసర ప్రాంతాల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి రాయించెరువు పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
అనంతరం వీర్నపల్లి మండల తహసీల్దార్‌కు రాయించెరువు పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.