మంత్రి నారాయణ మాస్ పిక్చర్
మంత్రి నారాయణ మాస్ పిక్చర్
రోడ్డు పక్కనే టీ-టిఫిన్.. టెంకాయ్ బండి దగ్గర ముచ్చట్లు
కారు దిగి అందరితో కలసిపోయారు.. నెల్లూరు ప్రజాక్షేత్రంలో మంత్రి నారాయణ సంచలనం
ఆడంబరం లేదు.. ఆర్భాటం లేదు.. సామాన్యుడిలా పేదల గుండెల్లోకి మంత్రి నారాయణ
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ :
అధికార హోదాను, ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మంత్రి నారాయణ సోమవారం నెల్లూరు నగరంలోని 53, 54వ డివిజన్లలో జరిపిన పర్యటన ఘనంగా సాగింది. నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడిగా తన మార్కును మరోసారి చాటుకున్న మంత్రి, కార్ దిగి నేరుగా వీధుల్లోకి వచ్చి సామాన్య ప్రజల్లో ఒకడిగా కలిసిపోయారు. ఒక చిన్న టీ కొట్టు వద్ద ఆగి స్థానికులతో కరచాలనం చేస్తూ, సరదాగా ముచ్చటిస్తూ టీ తాగిన తీరు స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది.
అక్కడితో ఆగకుండా, నగర వీధుల్లో కాలినడకన తిరుగుతూ ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఒక సాధారణ టిఫిన్ సెంటర్‌కు వెళ్లి, పేద ప్రజల పక్కనే కూర్చుని ఎంతో ఆప్యాయంగా అల్పాహారం చేశారు. 53వ డివిజన్‌లో టెంకాయలు అమ్ముకునే ఒక మహిళ వద్ద బండి ఆపి,వ్యాపారం ఎలా జరుగుతుందమ్మా కుటుంబం సౌఖ్యమేనా అని ఆత్మీయంగా పలకరించి, ఆమె కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.ఏ చిన్న ఆర్భాటం లేకుండా, ఒక కన్నతండ్రిలా, ఇంటి పెద్దలా ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలను ఆలకించిన మంత్రి నారాయణ ఉదారతపై నెల్లూరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వెంట నగరపాలక సంస్థ మేయర్ డి.సుజాత రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, టిడిపి నాయకులు పాల్గొన్నారు.