BREAKING
వైఎస్సార్సీపీ యువజన విభాగం నేత సద్దలతో కాటసాని ఆత్మీయ కలయిక ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్ ఆనంద్ దుల్కర్ సల్మాన్ కీలక హెచ్చరిక.. ఆ ఫేక్ అకౌంట్‌ను నమ్మి మోసపోవద్దంటూ పోస్ట్ స్వర్ణగ్రామం,స్వర్ణవార్డు ఉద్యోగుల ఆచరణ సాధ్యమైన సమస్యల పరిష్కారానికి చర్యలు ఆక్వా రైతులకు విద్యుత్‌ భరోసా దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి-డిసేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్ వలి కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ మరియు రైల్వే కాలనీలలో సరఫరా చేస్తున్న నీటి నాణ్యతపై పటిష్ఠ పర్యవేక్షణ సొంతింటి కలకు మంత్రి నారా లోకేష్‌ చేయూత నంద్యాలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ ప్రస్థానంపై అంబరాన్నంటిన సంబరాలు భర్తతో డేటింగ్ ఎప్పుడొ మొదలైందంటే.. సీక్రెట్స్ బయటపెట్టిన హీరోయిన్ తాప్సీ పన్ను విద్యార్థులు, యువత భాగస్వామ్యంతో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలి* భగత్ సింగ్ విగ్రహానికి నివాళులు, పాలాభిషేకం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 19 అర్జీలు --- కమిషనర్ ప్రజావాణి దరఖాస్తులపై అలసత్వం వద్దు ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండకూడదు*

కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణకు రూ.160 కోట్ల బిల్లుల విడుదల

Select Suryaa Now
కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణకు రూ.160 కోట్ల బిల్లుల విడుదల

*సాగునీటి వ్యవస్థను గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం*

*రైతుల భాగస్వామ్యంతో సాగునీటి నిర్వహణకు ప్రాధాన్యత*

*ఓఅండ్ఎం పనులకు రెండేళ్లలో రూ.1,320 కోట్లు మంజూరు*

*సీఎం చంద్రబాబు కు ప్రత్యేక ధన్యవాదములు -మంత్రి నిమ్మల రామానాయుడు.*

సూర్య, స్టేట్ బ్యూరో :

కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) పనులకు సంబంధించి రూ.160 కోట్ల బిల్లులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురై, దెబ్బతిన్న సాగునీటి వ్యవస్థను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి గాడిలో పెడుతోందని మంత్రి తెలిపారు.

*రైతుల భాగస్వామ్యంతో సాగునీటి నిర్వహణకు పెద్దపీట*

గత ప్రభుత్వం రద్దు చేసిన సాగునీటి సంఘాల వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ధరించి రైతులకు కొండంత భరోసా కల్పించారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఎల్‌నినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న పరిమిత జల వనరులను సమర్థవంతంగా వినియోగించడంలో సాగునీటి సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

రైతుల భాగస్వామ్యంతోనే సాగునీటి నిర్వహణ మరింత సమర్థవంతంగా జరుగుతుందనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనకు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.

*ఐదేళ్లలో రూ.200 కోట్లు - రెండేళ్లలో రూ.1,320 కోట్లు*

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఓఅండ్ఎం పనులకు కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దీనివల్ల సాగునీటి వ్యవస్థ నిర్వహణ తీవ్రంగా దెబ్బతిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలోనే ఓఅండ్ఎం పనుల కోసం రూ.1,320 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు.

కాలువల్లో పూడికతీత, లాకులు, షట్టర్లు, రోప్‌ల మరమ్మతులు వంటి అత్యవసర పనులకు గత ప్రభుత్వంలో నిధులు కేటాయించలేదని మంత్రి విమర్శించారు. చివరకు సాగునీటి వ్యవస్థలో అవసరమైన గ్రీజు పెట్టడం వంటి చిన్నపాటి నిర్వహణ పనులకు కూడా నిధులు అందని పరిస్థితి నెలకొందని తెలిపారు.

కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణకు అవసరమైన నిధులను అందుబాటులో ఉంచుతూ, సాగునీటి వ్యవస్థను నిరంతరం సమర్థవంతంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రైతుల ప్రయోజనాలు, సాగునీటి భద్రతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.