BREAKING
జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే నల్ల బ్యాడ్జీలతో నిరసన.. పది రోజులవుతున్నా పరిష్కారం కానీ సమస్యలు. భగత్ సింగ్ జయంతి వేడుకలు ఏలినో ప్రభావాన్ని అధిగమించే ప్రత్యామ్నాయ పంటలపై రైతులు మొగ్గు చూపాలి. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలి తొలి చిత్రమే కావడంతో చాలా లక్కీగా ఫీలవుతున్నా: తత్వం హీరోయిన్ దష్విక ప్రత్యేక ఇంటర్వ్యూ మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు సిటీలో అభివృద్ధి పరవళ్లు నెత్తురు మరిగే నిప్పుల కణం.షాహిద్ భగత్ సింగ్- అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు అనకాపల్లి చిత్రం.. ప్రీ రిలీజ్ వేడుకలో సినీ ప్రముఖుల ప్రశంసలు ట్రాన్స్‌జెండర్లకు ప్రశంస పత్రాలు అందజేసిన ఎస్పీ అది జింక మాంసమే..... అనంతపురం ఎక్సైజ్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ పార్వతి తిరువొతు రికార్డు సృష్టి.. యాభై కోట్ల క్లబ్ లోకి ప్రథమ దృష్టియ కుట్టక్కర్ నూనెపల్లె అండర్ రోడ్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యానికి వైసీపీ నేతలే ప్రధాన కారణం- సిపిఎం మాజీ నేత మస్తాన్ వలి

సొంతింటి కలకు మంత్రి నారా లోకేష్‌ చేయూత

Select Suryaa Now
సొంతింటి కలకు  మంత్రి నారా లోకేష్‌ చేయూత

ఎలాంటి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు లేకుండా ఉచితంగా ఇంటి పట్టాలు

కుంచనపల్లిలో ‘మన ఇల్లు–మన లోకేష్‌’ కార్యక్రమం

పేదల ఇళ్లకు శాశ్వత హక్కులు.. లబ్ధిదారుల హర్షం

ఇంటిపై రుణం పొందే అవకాశం కల్పించారంటూ ఆనందం

పీఎంఏవై కింద గృహ నిర్మాణ మంజూరు పత్రాల అందజేత

సూర్య, స్టేట్ బ్యూరో : 

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్‌ ముందుకు సాగుతున్నారని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు లేకుండా ఉచితంగా శాశ్వత ఇంటి పట్టాలు అందించడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని శ్రీనివాస కన్వెన్షన్‌లో నిర్వహించిన ‘మన ఇల్లు–మన లోకేష్‌’ కార్యక్రమంలో లబ్ధిదారులు తమ అనుభవాలను వెల్లడించారు.

తాడేపల్లి క్రిష్టియన్‌పేటకు చెందిన వై. జేసు ప్రసాదరావు, మేరీ ద్వారక మాట్లాడుతూ.. గత 50 ఏళ్లుగా క్రిష్టియన్‌పేటలో నివాసం ఉంటున్నామని, తాను రైల్వే ఉద్యోగిగా పదవీ విరమణ చేశానని తెలిపారు. శాశ్వత ఇంటి పట్టా వస్తుందని ఎన్నడూ ఊహించలేదని, గతంలో పలువురు నేతలకు అర్జీలు పెట్టినా పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదుగా పట్టా అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

అదే ప్రాంతానికి చెందిన ఇసుకపల్లి ప్రసాద్‌, విజయ్‌ మాట్లాడుతూ.. 60 ఏళ్లకు పైగా క్రిష్టియన్‌పేటలో నివసిస్తున్నామని తెలిపారు. ఎలాంటి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు లేకుండా ఉచితంగా శాశ్వత ఇంటి పట్టా అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమ సొంతింటి కలను నారా లోకేష్‌ నెరవేర్చారని పేర్కొన్నారు.

దాసరి మరియదాసు మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుంచే క్రిష్టియన్‌పేటలో నివాసం ఉంటున్నామని తెలిపారు. ఇంటిపై గతంలో రుణాలు పొందే అవకాశం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు ఆస్తికి పట్టాలు ఇవ్వడంతో ఆర్థిక అవసరాలకు ఇంటిపై రుణం పొందే అవకాశం కలిగిందన్నారు.

ఇసుకపల్లి ఆంటోనీ మాట్లాడుతూ.. గతంలో తమకు ఎలాంటి ఇంటి పట్టాలు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు ఆస్తిపై శాశ్వత హక్కు కల్పించడం పట్ల మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ ఇల్లు తమ సొంతమైందన్న భావన ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు.

వడ్డేశ్వరం గ్రామానికి చెందిన జి. గౌతమి మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా వడ్డేశ్వరంలో నివసిస్తున్నామని, శాశ్వత ఇంటి పట్టా రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నారా లోకేష్‌ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పేదలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు.

నవులూరుకు చెందిన కొత్తపల్లి సరోజిని, లక్ష్మి మాట్లాడుతూ.. 35 ఏళ్లుగా నవులూరులో నివసిస్తున్నామని తెలిపారు. రేకుల ఇంటిలో ఉంటూ వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఈదురుగాలులకు రేకులు పడిపోయేవని చెప్పారు. సొంత స్థలం ఉన్నందున గృహ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా, పీఎంఏవై పథకం కింద రూ.2.50 లక్షల సబ్సిడీతో గృహ నిర్మాణ మంజూరు పత్రం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.

ప్రాతూరుకు చెందిన సంకూరు గోపయ్య, భవాని మాట్లాడుతూ.. సొంతింటి కల నెరవేరుతుందని ఊహించలేదన్నారు. నూతన వస్త్రాలు అందించి, భోజనం పెట్టి మరీ గృహ నిర్మాణ మంజూరు పత్రం అందించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో మంగళగిరి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారని పేర్కొన్నారు. తమ సొంతింటి కల నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.