BREAKING
మదనపల్లె పట్టణంలో రూ.27 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనారోగ్యంలోనూ అంకితభావం.. నటి డింపుల్ హయాతీపై త్రివిక్రమ్ ప్రశంసలు, ఆసక్తికర కామెంట్స్ వార్డు సమస్యలపై ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి పెద్ద శంకరంపేట లో భగత్ సింగ్ జయంతి వేడుకలు. సీఈ సి జ్ఞానేశ్ కుమార్​ను దేశద్రోహిగా ప్రకటించి అరెస్ట్ చేయాలి.... జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నంద్యాలలో బిగ్ బాస్...బిగ్ రక్తదానం శిబిరం సమాజోద్ధరణ, స్వాతంత్ర్యోద్యమ పిపాసులు పెద్దాపూర్‌లో అండర్ డ్రైనేజీ పనులకు భూమిపూజ ఆ ఒక్క మాట నన్ను కట్టిపడేసింది.. చెన్నై వేడుకలో రాజమౌళి భావోద్వేగ వ్యాఖ్యలు పేదలకు సంజీవని సీఎం సహాయనిధి -ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రిచ్ మూవీ.. బస్తీ బాయ్ లవ్ స్టోరీగా రానున్న మోహిత్ పెడాడ చిత్రం సీఎం రాక ముందే పెండింగ్ పనులు ప్రారంభించాలి ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో ఘన విజయం.. అత్యధిక ఓట్లతో రెండోసారి సెక్రటరీగా ముళ్లపూడి మోహన్ నవంబర్ 21న హైదరాబాద్‌లో ప్రముఖ గాయని కేఎస్‌ చిత్ర చిత్రామృతం 3.0 మ్యూజికల్ కాన్సర్ట్ తుఫాన్ ప్రభావిత పంట నష్టాల ఎన్యుమరేషన్‌ను వేగంగా పూర్తి చేయాలి

ఏలినో ప్రభావాన్ని అధిగమించే ప్రత్యామ్నాయ పంటలపై రైతులు మొగ్గు చూపాలి.

Select Suryaa Now
ఏలినో ప్రభావాన్ని అధిగమించే ప్రత్యామ్నాయ పంటలపై రైతులు మొగ్గు చూపాలి.

ఏలినో ప్రభావాన్ని అధిగమించే ప్రత్యామ్నాయ పంటలపై రైతులు మొగ్గు చూపాలి

కూరగాయల సాగుతో నిరంతర ఆదాయం

ఉద్యానవన వ్యవసాయ శాఖ సమన్వయంతో జిల్లాలో కూరగాయల సాగు చేస్తున్న రైతులకు ప్రోత్సాహకాలు.

పాలి హౌస్ ద్వారా కూరగాయలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతు.

ఆధునిక సాగు విధానాలను యువ రైతులు ఆదర్శంగా నిలవాలి

ముత్రాజ్ పల్లి లో ఉద్యాన పంటల క్షేత్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్

మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

కౌడిపల్లి ; ఏలినో ప్రభావాన్ని అధిగమించే ప్రత్యామ్నాయ పంటలపై రైతులు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ రైతులకు సూచించారు.సోమవారం కౌడిపల్లి మండలం, ముత్రాజ్ పల్లి గ్రామంలో* ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో చేపట్టినఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని సంప్రదాయ వరి సాగును వదిలి పాలీహౌస్ లో 20 గుంటలలో కూరగాయలను సాగు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్  క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు.ముందుగా పాలీహౌస్ లో కీరా దోసకాయ సాగు చేస్తున్నగ్రామానికి చెందిన రైతు *కె. రవీందర్* కు చెందిన పాలీహౌస్ ను కలెక్టర్ సందర్శించారు. రైతుతో సాగు ఖర్చు, దిగుబడి, మార్కెటింగ్ మరియు వస్తున్న ఆదాయం గురించి కలెక్టర్ గారు అడిగి తెలుసుకున్నారు.
పాలీహౌస్లో కూరగాయల సాగు విధానంపై రైతు రవీందర్ కలెక్టర్ కు వివరిస్తూ రాష్ట్ర పథకం 2018-19 కింద ఏర్పాటు చేసిన ఈ పాలీహౌస్ లో ప్రస్తుతం యూరోపియన్  కీర దోసకాయ సాగు చేస్తున్నానని .  2000 చ.మీ పాలీహౌస్ లో 90 రోజులలో 25 నుండి 30 టన్నుల దిగుబడి వస్తుందని, పంటకు రూ. 7-8 లక్షల వరకు నికర లాభం వస్తుందని రైతు తెలిపారు. రైతును కలెక్టర్  అభినందించి, ఇలాంటి ఆధునిక సాగు విధానాలను యువ రైతులు ఆదర్శంగా తీసుకోవాలని
సూచించారు.అనంతరం ఆయిల్ పామ్ లో పరాగ ఎన్ఎంఈఓ- ఓపి  పథకం కింద సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటలో *పరాగ సంపర్క పురుగులను (ఎలిడోబియస్ కామెరూనికస్) స్వయంగా కలెక్టర్ విడుదల చేశారు. ఈ పురుగుల వలన ఆయిల్ పామ్ లో పరాగ సంపర్కం సమర్థవంతంగా జరిగి, గెల బరువు మరియు దిగుబడి పెరుగుతుందని రైతులకు వివరించారు. ఆయిల్ ఫామ్ పంటను పరిశీలించి రైతులందరూ ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గుచూపి అధిక ఆదాయం పొందాలన్నారు. ఎంఐడిహెచ్  పథకం కింద నిర్మించిన ఫామ్ పాండ్ (వ్యవసాయ కొలను)* ను పరిశీలించారు. వేసవిలో ఉద్యాన పంటలకు రక్షక తడులు అందించడానికి ఈ కొలను ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు కలెక్టర్కు  వివరించారు.ఈ కార్యక్రమంలో  జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి ప్రతాప్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి, దేవ్ కుమార్  ఉద్యాన విస్తరణ అధికారులు, లివ్ పామ్ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.