BREAKING
కమ్మ పాలెం అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసోత్సవ వేడుకలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు సైన్స్ బస్ యాత్ర విశ్వభారతిలో టీఆర్‌ఎస్‌వీ జెండా రెపరెపలు 2026 నాటి విమానాల డెలివరీ లక్ష్యంపై ఎయిర్‌బస్ ధీమా పల్లె పండుగకు భారీగా తరలిన ప్రజలు లైసెన్స్ మద్యం షాప్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు..... పడారుపల్లి పీహెచ్‌సీలో పోషణ కార్యక్రమం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ నెల్లూరు సీడీపీఓ టి. అరుణ దేశంలో చారిత్రాత్మక అక్షరాస్యత ప్రగతి పెదభోగిల లో " ఇంటింటికి మన్యం పోలీస్ " పలు అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసం మహోత్సవాల కార్యక్రమం,ఐ సి డి ఎస్ రంగనాయకులపేట సెక్టర్ సూపర్వైజర్ కే.విజయలక్ష్మి ఎన్నికల సమయంలో సమస్యాత్మక వార్డుల్లో ప్రత్యేక నిఘా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల విద్యుత్ కేటగిరీ మార్పుపై కృతజ్ఞతలు ప్రపంచ హృదయ దినోత్సవం 2026 పద్మశాలి భవనానికి 2 కోట్ల నిధులు విడుదల బాచేపల్లి తాండ విద్యా కమిటీ చైర్మన్గా కృష్ణ నాయక్

పేదలకు సంజీవని సీఎం సహాయనిధి -ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది

Select Suryaa Now
పేదలకు సంజీవని సీఎం సహాయనిధి -ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది

పేదలకు సంజీవని సీఎం సహాయనిధి
-ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది

-కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ నీలం మధు 
-లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన నీలం మధు

పటాన్‌చెరు, కష్టకాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎం ఆర్ ఎఫ్ ) సంజీవనిలా మారిందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. పేదల ఆరోగ్య భద్రతకు సీఎం సహాయనిధి ఎంతో భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. సోమవారం చిట్కుల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని కానుకుంటకు చెందిన కుమ్మరి రామదాసుకు రూ.60 వేల, ఇస్నాపూర్ మున్సిపాలిటీకి చెందిన అడపా ఎల్లమ్మకు రూ.60 వేల చొప్పున మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నీలం మధు ముదిరాజ్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు.సరైన సమయంలో వైద్యం అందక అప్పుల పాలవుతున్న కుటుంబాలను ప్రభుత్వం ఈ నిధి ద్వారా ఆదుకుంటోందని తెలిపారు.అనారోగ్యంతో బాధపడుతున్న పేదలు అధైర్యపడకుండా ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలన్నదే తమ సంకల్పమని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా నిధులు మంజూరయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు నీలం మధు తెలిపారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, మన్నే రాఘవేంద్ర, నారాయణదాసు, మణికంఠ, సర్పంచ్ కొరివి సురేష్, మాజీ ఉప సర్పంచ్ శోభకృష్ణ రెడ్డి, స్థానిక నాయకులు శ్రీనివాస్, వీరేష్, నర్సింలు, రాము, వెంకటేష్, బిక్షపతి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.