మల్కంబ్‌లో సత్తా చాటిన విద్యార్థులు
రాష్ట్ర స్థాయి పోటీలకు 24 మంది ఎంపిక
చౌటుప్పల్: చౌటుప్పల్‌లోని ట్రినిటీ హైస్కూల్ ప్రాంగణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 బాల, బాలికల మల్కంబ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. ప్రతిభ, నైపుణ్యం ఆధారంగా ఎంపికైన క్రీడాకారులు తెలంగాణ రాష్ట్ర స్థాయి పాఠశాలల క్రీడా సమాఖ్య మల్కంబ్ పోటీల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ సందర్భంగా చౌటుప్పల్ మండల విద్యాధికారి గురువారావు మాట్లాడుతూ.. మల్కంబ్ క్రీడ విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, సమతుల్యత, ఏకాగ్రత, చురుకుదనం, క్రమశిక్షణ పెంపొందించడంలో ఎంతో దోహదపడుతుందన్నారు. పాఠశాల స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవకాశాలు కల్పించడమే ఎంపిక పోటీల ప్రధాన ఉద్దేశమన్నారు. విద్యతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని, భారతీయ సంప్రదాయ క్రీడ అయిన మల్కంబ్‌ను ప్రోత్సహించి దాని అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో పీఈటీ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమూర్తి, పాఠశాలల క్రీడా సమాఖ్య మండల కార్యదర్శి లింగయ్య, జెడ్పీహెచ్‌ఎస్ కోయిలగూడెం ఉపాధ్యాయుడు మట్టయ్య, ట్రినిటీ హైస్కూల్ చైర్మన్ కె.వి.బి. కృష్ణారావు, ప్రిన్సిపాల్, డైరెక్టర్ ఉజ్జిని మంజుల, తెలంగాణ మల్కంబ్ సంఘం కార్యదర్శి ఎం. గోపాల్, వివిధ పాఠశాలల పీఈటీలు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు:
అండర్-14 బాలికలు: ఎన్. వైష్ణవి, ఎం. మేఘన, పి. హారిణి, కె. కావ్యశ్రీ, చ. హర్షిత, ఎన్. నిత్యశ్రీ.
అండర్-14 బాలురు: బి. చరణ్, వేదమానస్, డి. యశ్వంత్, చ. విఘ్నేష్, చ. సంజయ్‌కుమార్, బి. ఆదిత్య.
అండర్-17 బాలురు: చ. దీక్షిత్, యు. రాధేశ్యామ్, పి. శశాంక్, జి. చిద్విలాస్, కె. కరణ్, ఎ. సాయికార్తిక్.
అండర్-17 బాలికలు: ఎ. ఆకాంక్ష, ఎన్. మోక్షిత, కె. కృతిక, ఎ. వైష్ణవి, ఎస్. సహితి, జి. ప్రణవి.