లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ* చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్
చిట్యాల మేజర్ న్యూస్అ,ర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపడుతున్నట్లు చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్ అన్నారు. చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మంగళవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్ మాట్లాడుతూ రేషన్ కార్డు ప్రతి పేద కుటుంబానికి ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే ఉచిత సన్నబియ్యం తదితర సంక్షేమ ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు మరింత పారదర్శకంగా, సులభంగా సేవలు అందే అవకాశం ఉంటుందని తెలిపారు.
రేషన్ కార్డుల విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మూడో వార్డు కౌన్సిలర్ గాలి యాదమ్మ లింగయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.