మధ్యవర్తిత్వం పై అవగాహన సదస్సు.
- సోమరాజపురం లో జూనియర్ సివిల్ సబ్ జడ్జి కందికట్ల రాణి ఆధ్వర్యంలో నిర్వహణ
కొత్తూరు సెప్టెంబర్ 29(మేజర్ న్యూస్)కొత్తూరు మండలం సోమరాజపురం లో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఉత్తర్వులు మేరకు మధ్యవర్తిత్వం మరియు చట్ట పరమైన అక్షరాస్యత అవగాహన సదస్సు కొత్తూరు జూనియర్ సివిల్ సబ్ జడ్జి కందికట్ల రాణి నిర్వహించారు. ఈ సందర్బంగా జడ్జి కందికట్ల రాణీ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ మధ్యవర్తిత్వం ద్వారా కేసులు రాజీ అవ్వాలని జడ్జి అన్నారు. బ్యాంకు రికవరీ కేసులు ,చెక్ బౌన్స్ కేసులు ,సివిల్ కేసులు ,భూ తగాదాలు ,వివాహ సబంధమైన కేసులు ,మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని తెలియజేశారు. ఈ విధంగా ప్రతీ ఒక్కరూ కేసులు పరిష్కరించుకోవాలని తెలిపారు. ఉచిత న్యాయ సలహాలు ,ఉచిత న్యాయం,మా కోర్టు ను ఆశ్రయిస్తే పరిష్కారం ,మరియు వరకట్నం కోసం అవగాహన కల్పించారు. కార్యక్రమం అనంతరం డ్వాక్రా సంఘాల మహిళలు జూనియర్ సివిల్ సబ్ జడ్జి కందికట్ల రాణి ని శాలువ కప్పి సన్మానించారు. మరియు తహసీల్దార్ సరోజిని ,యస్ ఐ వెంకటేష్ ను సన్మానించారు. అడ్వకేట్ మరియు బార్ అధ్యక్షులు సిహెచ్ రవికిరణ్ ,సీనియర్ న్యాయవాది వి సుధాకరరావు , ఏ ధర్మారావు, ఏ జిపి యం అప్పారావు,ఆర్ రాజు ,జి పల్గుణరావు ,వి ఫల్గుణరావు, కొత్తూరు తహసీల్దార్ సరోజిని ,యస్ ఐ వెంకటేష్ కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.