BREAKING
టీనేజర్ల భద్రత కోసం వాట్సాప్ కీలక ఫీచర్: ఐచ్ఛిక ‘పేరెంటల్ కంట్రోల్స్’ ప్రవేశపెట్టిన మెటా ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ ‘అద్భుతం’: భారత్-అమెరికా బంధంపై అమెరికా రాయబారి ప్రశంసలు వినియోగదారులపై ధరల భారం: ఇండోర్‌లో నేటి నుంచి లీటరు పాలకు ₹3 పెంపు! జీ20 సదస్సు వేళ భారత్-పోలండ్ ద్వైపాక్షిక భేటీ: వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై పీయూష్ గోయల్ కీలక చర్చలు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

టిడిపి కూటమి ప్రభుత్వంలో నిరంతర విద్యుత్

Select Suryaa Now
టిడిపి కూటమి ప్రభుత్వంలో నిరంతర విద్యుత్

సిఎస్ పురం,మేజర్ న్యూస్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్ అందిస్తున్నట్లు టిడిపి నాయకులు అన్నారు.మంగళవారం మండలంలోని బోయమడుగుల పంచాయతీ వెంకటాయచెరువు,బాలుపల్లి,కొట్టాలు గ్రామాల్లో ప్రభుత్వం ఆర్ డి ఎస్ పధకం కింద కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాన్సుఫార్మర్ నాయకులు ప్రారంభించారు.ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ  రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్నివసతులు కల్పించి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు అదేవిధంగా నిరంతర విద్యుత్తు అందించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్ డి ఎస్ పధకం కింద ట్రాన్సుఫార్మర్లు,విద్యుత్ స్తంభాలు, లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈసందర్భంగా త్రీఫెజ్ కరెంట్ అందించడానికి కృషిచేసిన ఎమ్మెల్యే, ఒంగిలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి కృతజ్ఞతలు తెలువుతున్నట్లు అన్నారు.ఈకార్యక్రమంలో షీప్ సొసైటీ డైరెక్టర్ కె.వెంకటకొండయ్య,ఆవుల మహాలక్ష్మయ్య, గొర్ల అల్లూరయ్య,యం.వి.రమణయ్య,కె.రామకృష్ణ,కె.కొండయ్య,బి.రమణయ్య,గురవయ్య,మహేంద్ర, రమేష్,గ్రామస్థులు ఉన్నారు.