BREAKING
టీనేజర్ల భద్రత కోసం వాట్సాప్ కీలక ఫీచర్: ఐచ్ఛిక ‘పేరెంటల్ కంట్రోల్స్’ ప్రవేశపెట్టిన మెటా ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ ‘అద్భుతం’: భారత్-అమెరికా బంధంపై అమెరికా రాయబారి ప్రశంసలు వినియోగదారులపై ధరల భారం: ఇండోర్‌లో నేటి నుంచి లీటరు పాలకు ₹3 పెంపు! జీ20 సదస్సు వేళ భారత్-పోలండ్ ద్వైపాక్షిక భేటీ: వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై పీయూష్ గోయల్ కీలక చర్చలు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి: ఎస్పీ అద్నాన్ నయీం అస్మి

Select Suryaa Now
పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి: ఎస్పీ అద్నాన్ నయీం అస్మి

భీమవరం, మేజర్ న్యూస్: జిల్లాలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేసి, సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, ముఖ్యంగా ఆస్తి నేరాల్లో చోరీ సొత్తు రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. NDPS, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, మహిళలపై నేరాల కేసులను ప్రాధాన్యతతో దర్యాప్తు చేయాలన్నారు.e-Office, e-Deployment, Cri-MAC, ICJS, CCTNS వంటి సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించాలని, కేస్ డైరీలను ఆన్‌లైన్‌లో క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. శాస్త్రీయ ఆధారాలతో పక్కా చార్జిషీట్లు దాఖలు చేసి నేరస్థులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రజా ఫిర్యాదులపై మానవీయంగా, బాధ్యతాయుతంగా స్పందించి ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచాలని సూచించారు. కోర్టు సమన్లు, నాన్‌బెయిలబుల్ వారెంట్ల అమలులో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ డి. విశ్వనాథ్, డీఎస్పీలు రఘువీర్ విష్ణు, ఎం. సుధాకర్, యు. రవిచంద్ర, సీఐలు, ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

 

 శ్రీనివాస్ భీమవరం