BREAKING
టీనేజర్ల భద్రత కోసం వాట్సాప్ కీలక ఫీచర్: ఐచ్ఛిక ‘పేరెంటల్ కంట్రోల్స్’ ప్రవేశపెట్టిన మెటా ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ ‘అద్భుతం’: భారత్-అమెరికా బంధంపై అమెరికా రాయబారి ప్రశంసలు వినియోగదారులపై ధరల భారం: ఇండోర్‌లో నేటి నుంచి లీటరు పాలకు ₹3 పెంపు! జీ20 సదస్సు వేళ భారత్-పోలండ్ ద్వైపాక్షిక భేటీ: వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై పీయూష్ గోయల్ కీలక చర్చలు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

జిల్లాలో మొదటి రోజు సందడిగా ప్రారంభమైన పల్లె పండుగ కార్యక్రమం

Select Suryaa Now
జిల్లాలో మొదటి రోజు సందడిగా ప్రారంభమైన పల్లె పండుగ కార్యక్రమం

అనకాపల్లి ప్రతినిధి, సెప్టెంబర్ 29, మేజర్ న్యూస్: 
జిల్లాలో మొదటి రోజు పల్లె పండుగ కార్యక్రమం సందడిగా ప్రారంభమైంది. మంగళవారం పల్లె పండుగ 3.0 కార్యక్రమములో భాగంగా పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో అనకాపల్లి జిల్లాలో సి.సి. రోడ్లు 2356 పనులకు రూ.176.00కోట్లు అంచనా విలువతో 363.48 కిలోమీటర్లు మంజూరు కాగా డబ్ల్యూ బి ఎంరోడ్లు 11 పనులకు గాను రూ.2.67 కోట్ల రూపాయలతో 6.64 కిలోమీటర్లు మరియు బి టి రోడ్లు 38 పనులకు గాను రూ. 16.90 కోట్లతో 31.10 కిలోమీటర్లు మంజూరు కాబడినవి. మొత్తం 2405 పనులకు గాను రూ.195.17కోట్లుతో 400.91 కిలోమీటర్లు మంజూరు అయినవి.
జిల్లాలో పల్లె పండుగ 3.0 సందర్భంగాఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి  చింతకాయల అయ్యన్నపాత్రుడు పల్లె పండుగ 3.0 కార్యక్రమము సందర్భంగా మంగళవారం నాతవరం మండలం, డి. యెర్రవరం గ్రామంలో సి.సి. రోడ్లకు శంకుస్థాపన చేశారు.
జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్  మంగళవారం మధ్యాహ్నం రాంబిల్లి మండలం, హరిపురం గ్రామములొ సి.సి. రోడ్ల పనులకు  యలమంచిలి శాసన సభ్యులు సుందరపు విజయ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
చోడవరం శాసన సభ్యులు  కె.ఎస్.ఎన్.ఎస్. రాజు మంగళవారం చోడవరం మండలం, చోడవరం శివారు అన్నవరం గ్రామములొ సి.సి. రోడ్లుకు  శంకుస్థాపన చేశారు.