BREAKING
నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు బంగారు బందరుగా మచిలీపట్నం తీర్చిదిద్దుతాం

కేసుల దర్యాప్తులో లోపాలకు తావివ్వొద్దు

Select Suryaa Now
కేసుల దర్యాప్తులో లోపాలకు తావివ్వొద్దు

మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి
అదనపు ఎస్పీ రాజేష్ మీనా
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 29): కేసుల దర్యాప్తులో లోపాలకు తావివ్వకుండా పకడ్బందీగా దర్యాప్తు చేపట్టాలని వికారాబాద్ జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ప్రాసిక్యూషన్ రివ్యూ కమిటీ (డీపీఆర్‌సీ) సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆగస్టు నెలలో నమోదైన గ్రేవ్ అక్విటల్ కేసులను కేసుల వారీగా సమీక్షించారు. నిందితులు నిర్దోషులుగా విడుదల కావడానికి గల కారణాలు, దర్యాప్తులో చోటుచేసుకున్న లోపాలు, సాక్ష్యాధారాల సమర్పణ, సాక్షుల హాజరు తదితర అంశాలను పరిశీలించారు. గుర్తించిన లోపాలు పునరావృతం కాకుండా తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.దర్యాప్తు అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు, సెషన్స్ కోర్టు లైజన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, కోర్టు కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సాక్ష్యాధారాల సేకరణ, కేసు రికార్డుల నిర్వహణ, సాక్షుల హాజరు, చార్జ్‌షీట్‌ల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

*మహిళల భద్రతకు సమన్వయంతో సేవలు
తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో మహిళల భద్రత, రక్షణ చర్యలు, మహిళలకు అందుతున్న సేవలపై నిర్వహించిన సెన్సిటైజేషన్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా పాల్గొన్నారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళల భద్రతకు సంబంధించిన వివిధ విభాగాల పనితీరు, బాధ్యతలు, సమన్వయంపై అవగాహన కల్పించారు.షీ టీమ్స్, భరోసా, సెక్సువల్ అపెన్సేస్ మాడ్యూల్/ITSSO, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, మిస్సింగ్ మానిటరింగ్ సెల్, డొమెస్టిక్ వయొలెన్స్ అండ్ ఎన్‌ఆర్‌ఐ మాడ్యూల్, ప్రైడ్ ప్లేస్, సహాస్, స్టాండ్ విత్ హర్, ఉమెన్ హెల్ప్ డెస్క్ తదితర విభాగాల విధులు, సేవలపై చర్చించారు. మహిళలు, బాలికల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, బాధితులకు అవసరమైన సహాయం అందించాలని అధికారులకు సూచించారు.ఈ  కార్యక్రమాల్లో డీఎస్పీలు అంజయ్య, నర్సింగ్ యాదయ్య, లీగల్ అడ్వైజర్ అనిల్ కుమార్, సీఐలు కొండల్ రెడ్డి, చంద్రశేఖర్, వెంకట్, పరమేశ్వర్ గౌడ్, రఘురామ్, రఘు కుమార్, భరోసా, షీ టీమ్స్ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ ప్రమీల, ఏహెచ్‌టీయూ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ అన్వర్ పాషా, ఎస్‌ఐ శ్వేతతో పాటు సంబంధిత ఎస్‌డీపీఓలు, కోర్టు లైజన్ అధికారులు, సీడీఓలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

కుమ్మరి రాఘవేందర్ వికారాబాద్  జిల్లా ప్రతినిధి.