BREAKING
టీనేజర్ల భద్రత కోసం వాట్సాప్ కీలక ఫీచర్: ఐచ్ఛిక ‘పేరెంటల్ కంట్రోల్స్’ ప్రవేశపెట్టిన మెటా ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ ‘అద్భుతం’: భారత్-అమెరికా బంధంపై అమెరికా రాయబారి ప్రశంసలు వినియోగదారులపై ధరల భారం: ఇండోర్‌లో నేటి నుంచి లీటరు పాలకు ₹3 పెంపు! జీ20 సదస్సు వేళ భారత్-పోలండ్ ద్వైపాక్షిక భేటీ: వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై పీయూష్ గోయల్ కీలక చర్చలు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

గుండెజబ్బుల ముప్పు నుంచి బయటపడేందుకు జీవనశైలిలో మార్పులు అవసరం,ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణి

Select Suryaa Now
గుండెజబ్బుల ముప్పు నుంచి బయటపడేందుకు జీవనశైలిలో మార్పులు అవసరం,ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణి

 

ఒంగోలు, మేజర్ న్యూస్ : ,మంచి జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా గుండెజబ్బుల ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణి తెలిపారు.

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్), ఒంగోలులో నిర్వహించిన అవగాహన ర్యాలీని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. మాణిక్యరావుతో కలిసి డాక్టర్ శ్రీవాణి ప్రారంభించారు. ఈ ర్యాలీలో వైద్య విద్యార్థులు, విద్యార్థులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజలకు గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ శ్రీవాణి మాట్లాడుతూ అవసరమైనప్పుడు వైద్యులను సంప్రదించి, వైద్యుల సూచనల మేరకు తగిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండెజబ్బులను ముందుగానే గుర్తించి, సరైన చికిత్స పొందవచ్చన్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని సూచించారు. ఒంగోలులో అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉందని, ప్రజలు ఈ వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. మాణిక్యరావు మాట్లాడుతూ గుండెజబ్బులకు సంబంధించి అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్ సేవలు, యాంజియోగ్రామ్ వంటి పరీక్షలు జీజీహెచ్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య సదుపాయాలను వినియోగించుకుని, గుండె సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన సమయంలో వైద్యులను సంప్రదించాలని సూచించారు.

గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని వైద్యాధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్డియాలజీ విభాగం వైద్యులు డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ మహేష్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డా మస్తాన్ భాష , నర్సింగ్ spndt ధన లక్ష్మీ ఏఆర్‌ఎంవోలు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఆసుపత్రి సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.