BREAKING
నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు బంగారు బందరుగా మచిలీపట్నం తీర్చిదిద్దుతాం

విద్యాకమిటీ ఎన్నికల్లోనూ చిత్ర విచిత్రలే...!

Select Suryaa Now
విద్యాకమిటీ ఎన్నికల్లోనూ చిత్ర విచిత్రలే...!

 

ఓటర్లు రాక.. కోరం లేక ఎస్.రాయవరం మండలంలో 3 స్కూల్స్ లో ఎన్నికలు వాయిదా

మేం ఏం తక్కువా...అన్నట్టు ఎస్.రాయవరంలో ఒకటి, దార్లపూడిలో రెండు స్కూల్స్ వాయిదా!

ఎస్.రాయవరం, మేజర్ న్యూస్:
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలంలో మంగళవారం స్కూల్ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. మండలంలోని 64 పాఠశాలల్లో 61 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికలు పూర్తి కాగా... 3 చోట్ల మాత్రం కోరం లేక వాయిదా పడ్డాయని మండల విద్యాశాఖ అధికారి పెన్నాడ అప్పారావు తెలిపారు.

అందులోనూ ట్విస్ట్ ఏంటంటే... మండలకేంద్రం ఎస్.రాయవరం లో బాలుర హైస్కూల్ ఒక్కటే వాయిదా పడితే... మేం ఏం తక్కువ కాదన్నట్టు పోటీగా దార్లపూడి గ్రామం ఏకంగా రెండు స్కూళ్లలో ఎన్నికలను వాయిదా వేయించింది!

వాయిదా పడ్డ స్కూళ్లు:
ఎస్.రాయవరం బాలుర హైస్కూల్
దార్లపూడి జడ్పీ హైస్కూల్
దార్లపూడి ఎలిమెంటరీ స్కూల్

దార్లపూడి హైస్కూల్లో 260 మంది ఓటర్లకు కనీసం 131 మంది రావాల్సి ఉండగా... అరకొర మంది మాత్రమే వచ్చారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు జాన్ మెతూషెలా "రండి బాబూ ఓటేయండి" అని ఫోన్లు చేస్తే... "ఊర్లో లేము, డ్యూటీకి వెళ్ళాలి, చేలో పని ఉంది" అంటూ తల్లిదండ్రులు జారుకోవడంతో ఎన్నిక వాయిదా పడింది. అక్కడే ఉన్న దార్లపూడి ఎలిమెంటరీ స్కూల్ కూడా అదే బాటలో వాయిదా పడింది.

కూటమి నాయకులు మాత్రం టైంకు వచ్చి స్కూల్లో ఆశీనులైనా , ఓటర్లు రాకపోవడంతో వెలవెలబోయి వెనుతిరిగారు.

ఈ మూడు స్కూళ్లలో తిరిగి ఎన్నికలు ఎప్పుడనేది ఉన్నతాధికారుల నిర్ణయం తర్వాత ప్రకటిస్తామని మండల విద్యాశాఖ అధికారి అప్పారావు చెప్పారు.