BREAKING
భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు: మంత్రి ఉత్తమ్

Select Suryaa Now
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు: మంత్రి ఉత్తమ్

 

 

????కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 16.32 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు

????రాష్ట్రంలో మొత్తం 1.06 కోట్ల రేషన్ కార్డులు—3.42 కోట్ల మందికి ఆహార భద్రత

????27, 28 తేదీల్లో హుజూర్‌నగర్, మిర్యాలగూడ, సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ విస్తృత పర్యటన

????రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న గత బీఆర్ఎస్—అప్పటి టీఆర్ఎస్—ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయకుండా పేద, మధ్యతరగతి కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని రాష్ట్ర నీటిపారుదల, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కొత్తగా కుటుంబాలు ఏర్పడినప్పటికీ, కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినప్పటికీ, లక్షలాది మంది అర్హులు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ గత ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోలేదని అన్నారు.

????ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆహార భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తాను పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టామని చెప్పారు.

????2025 జనవరి 1 నాటికి రాష్ట్రంలో 89,95,282 రేషన్ కార్డులు ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 16,32,810 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశామని తెలిపారు. ఈ కొత్త కార్డుల ద్వారా మరో 61,09,544 మందికి ఆహార భద్రత కల్పించామని పేర్కొన్నారు. పాత, కొత్త కార్డులు కలిపి ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 1,06,28,092 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటి ద్వారా 3,42,57,109 మంది ప్రజలు ప్రయోజనం పొందుతున్నారని వివరించారు.

????రాష్ట్రంలోని దాదాపు ప్రతి కుటుంబానికీ ఆహార భద్రత కల్పించే స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రేషన్ కార్డు అనేది కేవలం బియ్యం పొందడానికి ఉపయోగపడే పత్రం మాత్రమే కాదని, పేద కుటుంబాలకు ఆహార భద్రతతోపాటు అనేక సంక్షేమ పథకాలను అందించే కీలకమైన ఆధారమని చెప్పారు. ప్రతి అర్హ కుటుంబానికీ రేషన్ కార్డు అందించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

????రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ ప్రతి వ్యక్తికి నెలకు ఆరు కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. పేద ప్రజలు కూడా గౌరవంగా నాణ్యమైన బియ్యం తినాలన్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా సుమారు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

????ఈ భారీ సంక్షేమ కార్యక్రమంలో భాగంగానే తన సొంత నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌తోపాటు పొరుగున ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గంలోనూ లబ్ధిదారులకు రేషన్ కార్డులను స్వయంగా పంపిణీ చేయనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

????సెప్టెంబర్ 27, ఆదివారం ఉదయం మంత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరేడుచర్లకు చేరుకుంటారు. అక్కడ పాలకీడు, నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు. అనంతరం పాలకీడు మండలం ముసిఒడ్డు సింగారం గ్రామంలో ₹1.80 కోట్లతో నిర్మించిన ముసిఒడ్డు సింగారం–రోళ్లవారిగూడెం బీటీ రోడ్డును ప్రారంభిస్తారు.

????హుజూర్‌నగర్ పట్టణంలో జరిగే కార్యక్రమంలో హుజూర్‌నగర్ పట్టణం, మండలంతోపాటు మఠంపల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేస్తారు. అనారోగ్యం, ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసాగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు.

????తదుపరి మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామంలో ₹2.80 కోట్లతో నిర్మించిన వంతెనను ప్రారంభిస్తారు. కప్పలకుంట తండాలో ₹30 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ, విలేజ్ ఆర్గనైజేషన్ భవనాలు, వెల్లటూరు ఆర్ అండ్ ఆర్ కాలనీలో ₹10 లక్షలతో, వేపల మాధవరంలో ₹10 లక్షలతో నిర్మించిన విలేజ్ ఆర్గనైజేషన్ భవనాలను ప్రారంభిస్తారు.

????మేళ్లచెరువులో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువపై ₹3 కోట్ల వ్యయంతో నిర్మించిన మూడు వంతెనలను మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. చింతలపాలెం మండలం కొత్తగూడెం, గాంధీనగర్ తండాల్లో ఒక్కొక్కటి ₹20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభిస్తారు.

????సెప్టెంబర్ 28, సోమవారం గరిడేపల్లి మండలం కొండాయిగూడెంలో ₹10 లక్షలతో నిర్మించిన మహిళా స్వయం సహాయక సంఘం భవనాన్ని, రెగ్యులగడ్డ తండాలో ₹30 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ, స్వయం సహాయక సంఘం భవనాలను మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చేరుకుని అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు.

????ఈ రెండు రోజుల పర్యటనలో మొత్తం ₹8.90 కోట్ల విలువైన రహదారులు, వంతెనలు, గ్రామపంచాయతీ, విలేజ్ ఆర్గనైజేషన్, స్వయం సహాయక సంఘాల భవనాలను మంత్రి ప్రారంభించనున్నారు. గ్రామీణ రహదారులు, రవాణా సౌకర్యాలు, మహిళా సంఘాల మౌలిక వసతులు, గ్రామ పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ అభివృద్ధి పనుల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

????మిర్యాలగూడ కార్యక్రమం అనంతరం మంత్రి సూర్యాపేటకు చేరుకుని భారత ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉండాలంటే ఎన్నికల సంఘం పూర్తి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

????ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి ఓటుకు సమానమైన విలువ ఉందని, ప్రజల ఓటు హక్కును, ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడటం ప్రతి ప్రజాస్వామ్యవాది బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలు అధికార పార్టీలకు అనుకూలంగా కాకుండా దేశ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఓటు హక్కును రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టే పోరాటంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.