BREAKING
టీనేజర్ల భద్రత కోసం వాట్సాప్ కీలక ఫీచర్: ఐచ్ఛిక ‘పేరెంటల్ కంట్రోల్స్’ ప్రవేశపెట్టిన మెటా ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ ‘అద్భుతం’: భారత్-అమెరికా బంధంపై అమెరికా రాయబారి ప్రశంసలు వినియోగదారులపై ధరల భారం: ఇండోర్‌లో నేటి నుంచి లీటరు పాలకు ₹3 పెంపు! జీ20 సదస్సు వేళ భారత్-పోలండ్ ద్వైపాక్షిక భేటీ: వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై పీయూష్ గోయల్ కీలక చర్చలు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

RTI అవగాహన సదస్సుకు సమాచార కమిషనర్లకు ఆహ్వానం

Select Suryaa Now
RTI అవగాహన సదస్సుకు సమాచార కమిషనర్లకు ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్లను కలిసిన సమాచార హక్కు చట్టం సాధన కమిటీ 
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 7న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్న “RTI Act–2005 ఆవిర్భావ దినోత్సవం & అవగాహన సదస్సు”కు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్లను ఆహ్వానించారు.

కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయాన్ని సందర్శించి రాష్ట్ర సమాచార కమిషనర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అక్టోబర్ 7న నిర్వహించనున్న కార్యక్రమం ఉద్దేశాలు, కార్యక్రమ ప్రణాళిక మరియు ప్రజల్లో RTI Act–2005పై అవగాహన పెంపొందించేందుకు చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్, రాష్ట్ర సమాచార కమిషనర్ పి.వి. శ్రీనివాసరావు, రాష్ట్ర సమాచార కమిషనర్ మొహసినా పర్వీన్, రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి, రాష్ట్ర సమాచార కమిషనర్ మెర్ల వైష్ణవి లను కలిసి అధికారిక ఆహ్వాన పత్రాలను అందజేశారు.

RTI Act–2005 ద్వారా ప్రజలకు తమ సమాచార హక్కుపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం, ప్రజలు తమ హక్కులను చట్టబద్ధంగా వినియోగించుకునేలా చైతన్యం కల్పించడం సదస్సు ప్రధాన ఉద్దేశ్యమని కమిటీ ప్రతినిధులు తెలిపారు.

అక్టోబర్ 7న నిర్వహించనున్న సదస్సులో జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, నియోజకవర్గ, గ్రామ స్థాయి ప్రతినిధులు, RTI కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, విద్యావేత్తలు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నట్లు తెలిపారు. RTI చట్టం అమలు, ప్రజల భాగస్వామ్యం, సమాచార హక్కు వినియోగంపై అవగాహన వంటి అంశాలపై కార్యక్రమంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి, జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, రాష్ట్ర కార్యదర్శి రావుల నవీన్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ. శ్రీకాంత్ రెడ్డి, విజయ్ రామ్ సింగ్, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి షాదుల్ తదితరులు పాల్గొన్నారు.