వజ్రపుకొత్తూరులో ఎస్‌ఎంసీ చైర్మన్లు ఏకగ్రీవం.ఎమ్మెల్యే శిరీష నాయకత్వంలో కూటమి శ్రేణుల విజయకేతనం
పలాస /వజ్రపుకొత్తూరు, సెప్టెంబర్ 29,మేజర్ న్యూస్.,పలాస నియోజకవర్గం,వజ్రపుకొత్తూరు మండలంలో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.ఎమ్మెల్యే గౌతు శిరీష నాయకత్వంలో కూటమి నాయకుల సమన్వయంతో మంగళవారం నిర్వహించిన ఈ ఎన్నికలు సజావుగా ముగిశాయి.వజ్రపుకొత్తూరు ఎంపీపీ పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా కొత్తూర్తి శేషగిరిరావు, వైస్ చైర్మన్‌గా అడ్ల భవాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా పిట్ట రమణమ్మ, వైస్ చైర్మన్‌గా డాలిమా (నువ్వలరేవు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.కార్యక్రమంలో వజ్రపుకొత్తూరు, నువ్వలరేవు గ్రామాలకు చెందిన కూటమి నాయకులు, తల్లిదండ్రులు పాల్గొని నూతన కమిటీలకు అభినందనలు తెలిపారు.