BREAKING
టీనేజర్ల భద్రత కోసం వాట్సాప్ కీలక ఫీచర్: ఐచ్ఛిక ‘పేరెంటల్ కంట్రోల్స్’ ప్రవేశపెట్టిన మెటా ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ ‘అద్భుతం’: భారత్-అమెరికా బంధంపై అమెరికా రాయబారి ప్రశంసలు వినియోగదారులపై ధరల భారం: ఇండోర్‌లో నేటి నుంచి లీటరు పాలకు ₹3 పెంపు! జీ20 సదస్సు వేళ భారత్-పోలండ్ ద్వైపాక్షిక భేటీ: వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై పీయూష్ గోయల్ కీలక చర్చలు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు గ్రామ పంచాయతీలకు మౌలిక వసతులు: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Select Suryaa Now
ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు గ్రామ పంచాయతీలకు మౌలిక వసతులు: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు గ్రామపంచాయతీలకు మౌలిక వసతులు: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు,మేజర్ న్యూస్:

ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు గ్రామపంచాయతీలకు అవసరమైన మౌలిక వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.మంగళవారం
మండలంలోని గంగోరిగూడెం, బీరేల్లిగూడెం గ్రామాలలో రూ.20 లక్షల చొప్పున నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాలు, అలాగే రూ.10 లక్షల చొప్పున నిర్మించిన మహిళా సమాఖ్య భవనాలకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నూతన పంచాయతీ భవనాల ద్వారా గ్రామస్థులకు పాలనా సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.మహిళా సమాఖ్య భవనాలు మహిళా సంఘాల కార్యకలాపాలకు, సమావేశాలకు ఉపయోగపడటంతో పాటు మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు దోహదపడతాయని తెలిపారు. గ్రామాల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి,చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, ఓబీసీ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బూడిద లింగ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, పిఆర్ ఏ.ఈ సతీష్ రెడ్డి,ఐకేపీ 
ఏపిఎం గోసుల భాస్కర్,ఆయా గ్రామాల సర్పంచులు గొపగోని పాపయ్య గౌడ్, దాసరి గోవర్ధన్ యాదవ్, మాలుగు శ్రీను,కొండ శ్రీను, బొల్లం రమేష్ యాదవ్,కదిరే లింగయ్య యాదవ్,జాల జంగయ్య యాదవ్,కంభంపాటి జ్యోతి వెంకటేశ్వర్లు, ఏర్పుల మోహన్ బాబు,ఉప సర్పంచులు దోటీ వెంకటేశ్వర్లు, దాసరి పావని రమేష్, పంచాయతీ కార్యదర్శులు చిరుమర్తి వెంకన్న, జి.రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పుట్ట శ్రీనివాస్ రెడ్డి పందుల భాస్కర్, వివిధ శాఖల అధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.