ఉప్పరాపల్లిలో అంగన్వాడీ ఉత్సవం, పోషణ మాసోత్సవం!
ఉప్పరాపల్లిలో అంగన్వాడీ ఉత్సవం, పోషణ మాసోత్సవం!
ఎస్.రాయవరం, సెప్టెంబర్ 29, మేజర్ న్యూస్:
ఎస్. రాయవరం మండలం ఉప్పరాపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ ఉత్సవం, పోషణ మాసోత్సవాలను మంగళవారం సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ లబ్ధిదారులు, గర్భిణులు, బాలింతలు, తల్లులకు సముచిత పోషకాహారం ప్రాముఖ్యత, సమతుల ఆహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో ప్రవేశాలు కల్పించారు. గర్భిణీలు, బాలింతలకు PPI, IFA మాత్రల ప్రాధాన్యతను వివరించి, బుక్స్‌లో నమోదు చేశారు. చిన్నారులకు జీర్ణక్రియకు బాలామృతం ప్రాధాన్యతను అంగన్వాడీ కార్యకర్తలు తెలిపారు.
అంగన్వాడీ కార్యకర్తలకు, తల్లులకు సత్కారం!
మహిళా శిశు సంక్షేమం కోసం ఎంతో విలువైన సేవలను అందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు ఈ ఉత్సవం సందర్భంగా సత్కారం చేసారు. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించి వారికి చీర సారె తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్ బి.కనకదుర్గ, అంగన్వాడీ కార్యకర్తలు బి.అరుణ, ఎస్.సత్యప్రసన్న, టి.వెంకటరత్నం, తల్లులు గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.