BREAKING
పొడగట్లపల్లి ఓరియంటల్ ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా గండి శ్రీను ఎన్నిక.. ఫ్రాన్స్ ప్లాంట్లలో కార్ల ఉత్పత్తి తాత్కాలికంగా నిలిపివేత! పెదముషిడివాడ హైస్కూల్ నూతన చైర్మన్‌గా గోవింద్ హిరమండలం మండలంలో 55 పాఠశాలల్లో SMC ఎన్నికలు విజయవంతం: 3 పాఠశాలల్లో కోరం లేక వాయిదా! మొసలపల్లి ఎంపీపీ పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా గుత్తుల లక్ష్మణ్: ఘనంగా పాలకవర్గ ప్రమాణ స్వీకారం మధ్యవర్తిత్వం పై అవగాహన సదస్సు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి........... తిరుపతి రూరల్ సీఐ ఉప్పరాపల్లిలో అంగన్వాడీ ఉత్సవం, పోషణ మాసోత్సవం! ఎస్ఎంసి ఎన్నికల ప్రశాంతం... ఫైనాన్షియల్ సెక్టార్‌లో పెరుగుతున్న ఏఐ సైబర్ ముప్పు! కష్టకాలంలో పేదలకు కొండంత అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గార మండలంలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు... గూనపాలెం సెక్టార్‌లో ఘనంగా జాతీయ పోషణ మాసం వజ్రపుకొత్తూరులో ఎస్‌ఎంసీ చైర్మన్లు ఏకగ్రీవం. గూగుల్, ఎన్విడియా ఉత్పత్తులపై పడనున్న తీవ్ర ప్రభావం!

ఆదర్శ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ

Select Suryaa Now
ఆదర్శ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ

 


ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కుమారస్వామి

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా సేవా కార్యక్రమం

మోదీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

చింతపల్లి మేజర్ న్యూస్. నల్లగొండ జిల్లా : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా చింతపల్లి మండలంలోని ఆదర్శ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో, చింతపల్లి మండల శాఖ నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నారోజు. కుమారస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. దేశ సేవ, ధర్మ పరిరక్షణ, ప్రజల రక్షణ కోసం మోదీకి ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు.
సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా అక్టోబర్‌ 4న రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన, అక్టోబర్‌ 9న అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 11న గ్రామాలు, బస్తీలను దత్తత తీసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వీడియోలు, చిత్రాలను సేకరించి ప్రచారం చేయాలని సూచించారు.
కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు .రమేష్‌ యాదవ్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు కుకుడపు .రామకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి యనం. శేఖర్‌, వార్డు సభ్యులు నల్ల సైదులు, సోమరాజు, ప్రదీప్‌, గజ్జి అభినవ్‌, దండేటికారు మహేష్‌, సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షుడు సైదులు, మోహన్‌రెడ్డి, ఎస్‌.ఎస్‌.చారి తదితరులు పాల్గొన్నారు.