BREAKING
ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్ల మధ్య ఘర్షణ: ధైర్యసాహసాలు చూపిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన

నల్గొండలో లీగల్ మెటరాలజీ శాఖ తనిఖీ... #. 13 కేసుల నమోదు.

Select Suryaa Now
నల్గొండలో లీగల్ మెటరాలజీ శాఖ తనిఖీ...                       #. 13 కేసుల నమోదు.


నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్...     నల్గొండ నగర పంచాయతీలో వివిధ కూరగాయల దుకాణాలు, ఇనుము/హార్డ్‌వేర్ దుకాణాలు శానిటరీ లలో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి  శ్రీనివాసులు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీనివాసులు  టెక్నికల్ అసిస్టెంట్ కె. వెంకటేశ్వర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తనిఖీల సందర్భంగా ఆయా వ్యాపార సంస్థలలో వినియోగిస్తున్న తూకాలు కొలతల పరికరాల ధృవీకరణ, స్టాంపింగ్ చెల్లుబాటు, తూకాలు మరియు కొలతల ఖచ్చితత్వం, అలాగే ప్యాకేజ్డ్ వస్తువులపై తప్పనిసరిగా ప్రకటించాల్సిన వివరాలు తదితర అంశాలను పరిశీలించారు.
అర్థమైందా తనకీలలో లీగల్ మెట్రాలజీ యాక్ట్, 2009 నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన వ్యాపార సంస్థలపై మొత్తం 13 కేసులు నమోదు చేయడం జరిగింది. సంబంధిత కేసుల్లో నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టబడతాయి.
వ్యాపారులు తూకాలు మరియు కొలతల పరికరాలను నిర్ణీత కాలవ్యవధిలో ధృవీకరించించుకొని, చెల్లుబాటు అయ్యే స్టాంపింగ్‌తో మాత్రమే వినియోగించాలని, అలాగే ప్యాకేజ్డ్ వస్తువుల విషయంలో చట్టపరంగా నిర్దేశించిన అన్ని వివరాలను తప్పనిసరిగా ప్రకటించాలని జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి సూచించారు.
వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు లీగల్ మెట్రాలజీ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.