BREAKING
ఫలించిన గుకేశ్ వ్యూహం.. మూడో గేమ్ డ్రా ఫోక్సో కేసులో నిందితుడికి సంవత్సరం జైలు శిక్ష. తీవ్ర ఒడిదుడుకుల తర్వాత నిలదొక్కుకుంటున్న ఆసియా షేర్లు ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆదర్శ కుటుంబం’: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వెంకటేశ్, త్రివిక్రమ్ సినిమా కేంద్ర బడ్జెట్ 2027-28 రూపకల్పనకు ముందస్తు సంప్రదింపులు పూర్తి ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలు రూ.127 లక్షల కోట్లకు చేరిక కమర్షియల్ లెక్కలు లేకుండా చేసిన సినిమా: ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్ లాంచ్‌లో నితిన్ భావోద్వేగ ప్రసంగం పాక్ సిరీస్‌పై సినీ కార్మిక సంఘం అల్టిమేటం: ఆ సిరీస్ ఆపకపోతే నెట్‌ఫ్లిక్స్ షూటింగ్‌లు బంద్ చేస్తామని హెచ్చరిక 14వ జేడీసీసీ సమావేశంలో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిన భారత్, యూఏఈ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2 వరకు కేరళ, మిజోరం, నాగాలాండ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఐఓఆర్ఏ మంత్రివర్గ సమావేశానికి ముందు శ్రీలంక జాతీయ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా నందమూరి బాలకృష్ణ: సభ్యుడిగా అల్లు అరవింద్ నియామకం సామాజిక న్యాయం కోసం ఢిల్లీకి మాజీ ఎంపీ తలారి రంగయ్య ‘బాల 369’ కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిఖిల్ సిద్ధార్థ ప్రశంసలు సిద్ధార్థ్ దత్తాతో హీరోయిన్, మాజీ ఎంపీ మిమి చక్రవర్తి వివాహం: వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు

అనారోగ్యంలోనూ అంకితభావం.. నటి డింపుల్ హయాతీపై త్రివిక్రమ్ ప్రశంసలు, ఆసక్తికర కామెంట్స్

Select Suryaa Now
అనారోగ్యంలోనూ అంకితభావం.. నటి డింపుల్ హయాతీపై త్రివిక్రమ్ ప్రశంసలు, ఆసక్తికర కామెంట్స్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆదర్శ కుటుంబం చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన నారాయణమ్మ సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు వెంకటేష్ తనదైన ఎనర్జీతో వేసిన స్టెప్పులు, హీరోయిన్లు డింపుల్ హయాతీ, నివేదా పేతురాజ్ గ్రేస్‌ఫుల్ మూమెంట్స్ స్క్రీన్‌పై అదిరిపోయాయి. ఈ మాస్ బీట్‌కు అందరూ ఫిదా అవుతుండగా, ఈ పాట షూటింగ్ సమయంలో నటి డింపుల్ హయాతీ చూపించిన డెడికేషన్‌ను దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా అభినందించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

పాట షూటింగ్ సమయంలో డింపుల్ ఆరోగ్యం అంతగా బాగోలేదని, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆమె ఏమాత్రం వెనకడుగు వేయలేదని త్రివిక్రమ్ వెల్లడించారు. ఎంతో ఇష్టపడి, కష్టపడి ఈ మాస్ సాంగ్‌కు అద్భుతమైన డ్యాన్స్ చేసిందని, ఆమె ప్రదర్శించిన అంకితభావం నిజంగా అభినందనీయమని ఆయన ప్రశంసించారు. అంతేకాకుండా డింపుల్‌ని ఇలా పాటల షూటింగ్స్‌లో కాకుండా సినిమాలోని ఇతర ముఖ్యమైన సందర్భాల్లో కలవాలని కోరుకుంటున్నానని ఆయన సరదాగా వ్యాఖ్యానించడం విశేషం. దర్శకుడి నుంచి వచ్చిన ఈ ప్రశంసలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గల్ఫ్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన డింపుల్ హయాతీ, గద్దలకొండ గణేష్ చిత్రంలోని జర్ర జర్ర పాటతో యూత్ టార్గెట్‌గా భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత సామాన్యుడు, ఖిలాడి, రామబాణం వంటి చిత్రాలతో కమర్షియల్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంతో అలరించిన ఆమె, ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన నారాయణమ్మ పాటతో మరోసారి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టారు. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆదర్శ కుటుంబం సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడానికి ఈ బ్యూటీ కసితో ఎదురుచూస్తున్నారు.