BREAKING
కమ్మ పాలెం అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసోత్సవ వేడుకలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు సైన్స్ బస్ యాత్ర విశ్వభారతిలో టీఆర్‌ఎస్‌వీ జెండా రెపరెపలు 2026 నాటి విమానాల డెలివరీ లక్ష్యంపై ఎయిర్‌బస్ ధీమా పల్లె పండుగకు భారీగా తరలిన ప్రజలు లైసెన్స్ మద్యం షాప్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు..... పడారుపల్లి పీహెచ్‌సీలో పోషణ కార్యక్రమం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ నెల్లూరు సీడీపీఓ టి. అరుణ దేశంలో చారిత్రాత్మక అక్షరాస్యత ప్రగతి పెదభోగిల లో " ఇంటింటికి మన్యం పోలీస్ " పలు అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసం మహోత్సవాల కార్యక్రమం,ఐ సి డి ఎస్ రంగనాయకులపేట సెక్టర్ సూపర్వైజర్ కే.విజయలక్ష్మి ఎన్నికల సమయంలో సమస్యాత్మక వార్డుల్లో ప్రత్యేక నిఘా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల విద్యుత్ కేటగిరీ మార్పుపై కృతజ్ఞతలు ప్రపంచ హృదయ దినోత్సవం 2026 పద్మశాలి భవనానికి 2 కోట్ల నిధులు విడుదల బాచేపల్లి తాండ విద్యా కమిటీ చైర్మన్గా కృష్ణ నాయక్

మదనపల్లె పట్టణంలో రూ.27 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Select Suryaa Now
మదనపల్లె పట్టణంలో రూ.27 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మదనపల్లె పట్టణంలో రూ.27 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సీసీ, బీటీ రోడ్లు తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా
మదనపల్లె: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని, అందులో భాగంగా మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.27 కోట్ల నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు.
ఈ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన పలకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ.. మదనపల్లె మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.27 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఇప్పటికే మదనపల్లె నియోజకవర్గంలో సుమారు రూ.100 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. తాజాగా మంజూరైన నిధులతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు తదితర అభివృద్ధి పనులను చేపట్టి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల విద్యాసాగర్, నవీన్ చౌదరి, కమలామరి కృష్ణ, ఎస్.ఎం. రఫీ, పోతబోలు సుధాకర్‌తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.