BREAKING
కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై దేశవ్యాప్తంగా మొదలైన తీవ్ర చర్చ కొందుర్గు పిఏసిఎస్ నూతన చైర్మన్ గా అనిత జితేందర్ రెడ్డి. యూకే ఎయిర్‌బేస్ వద్ద ఐదుగురి అరెస్ట్ ఉజ్జయినిలో తీవ్ర ఉద్రిక్తత కిసాన్ మోర్చా జిల్లా నూతన కమిటీ నియామకం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలను మరింత విజయవంతం చేయాలి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోండి: ప్రతిపక్షాలకు మంత్రి వీరాంజనేయులు తీవ్ర హెచ్చరిక బ్రిటన్ బడ్జెట్‌లో ఆర్థిక క్రమశిక్షణే కీలక ప్రాధాన్యం విజయవాడ దసరా ఉత్సవాలకు ఏఐ సాంకేతికతతో పటిష్ట నిఘా ఏర్పాట్లు: మంత్రి సత్యకుమార్ విద్య, ఉపాధికి ప్రభుత్వం ప్రాధాన్యం: భట్టి విక్రమార్క పింఛనుదారులకు గుడ్ న్యూస్‌ హోంగార్డుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి కీసరగుట్టలో వైభవంగా పల్లకి సేవ పరశురాంపల్లి తరిలింపునకు సానుకూల స్పందన విజయవాడ సీఐ అలీ మృతి కేసులో కీలక పురోగతి

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రిచ్ మూవీ.. బస్తీ బాయ్ లవ్ స్టోరీగా రానున్న మోహిత్ పెడాడ చిత్రం

Select Suryaa Now
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రిచ్ మూవీ.. బస్తీ బాయ్ లవ్ స్టోరీగా రానున్న మోహిత్ పెడాడ చిత్రం

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ఎంజి ఆర్ట్స్, ఐఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్లపై రూపొందుతున్న సరికొత్త సినిమా రిచ్ పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. బేబీ ఆరాధ్య, ఆదర్శ్ సమర్పణలో పద్మనాభ రెడ్డి, మార్గం గోపి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహేంద్ర ఎస్ గైక్వాడ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏ బస్తీ బాయ్ లవ్ స్టోరీ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షికగా ఉంది. మోహిత్ పెడాడ, శ్రీజిత ఘోష్ జంటగా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌కు రాజా నరేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఘనంగా జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకకు గోపీ మోహన్, దశరథ్, వి సముద్ర, జి రామ్ ప్రసాద్, డి ఎస్ రావు, మిట్టపల్లి సురేందర్, ముక్కు అవినాష్ వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ దర్శకుడు రాజా నరేంద్ర చెప్పిన కథ చాలా రిచ్‌గా ఉందని, సాయి కార్తీక్ సంగీతం ఈ సినిమాకు మరింత బలం చేకూరుస్తుందని తెలిపారు. వచ్చే నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకువస్తామని పేర్కొన్నారు. హీరో మోహిత్ పెడాడా మాట్లాడుతూ సినిమాలోని ఇంటర్వెల్ సీన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని, క్లైమాక్స్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడు రాజా నరేంద్ర మాట్లాడుతూ నేటి తరానికి నచ్చేలా ఒక సరికొత్త బస్తీ బాయ్ ప్రేమకథను తెరకెక్కిస్తున్నామని, అందరి సహకారంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తామని తెలిపారు.

సహ నిర్మాత మహేంద్ర గైక్వాడ్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ముందుగా తెలుగులో విడుదల చేసి, ఆ తర్వాత హిందీలోకి కూడా డబ్ చేసి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. హీరోయిన్ శ్రీజిత ఘోష్, నటి పూజా కేంద్రే మాట్లాడుతూ ఈ చిత్రంలో తమకు మంచి పాత్రలు లభించాయని, ప్రేక్షకులు అందరినీ ఈ సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సతీష్ రెడ్డి కెమెరా వర్క్, సాయి కార్తీక్ బాణీలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకతో చిత్ర బృందం సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.