వార్డు సమస్యలపై ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి ::జిల్లా కేంద్రంలోని 22,23,24 వార్డుల్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిశీలించేందుకు సోమవారం రోజున మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వార్డుల్లో పర్యటిస్తూ పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర సమస్యలను పరిశీలించారు. స్థానిక ప్రజలను అడిగి వారి సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి సంబంధిత మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని చైర్‌పర్సన్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ పర్వతాలు, కౌన్సిలర్స్ యూనుస్, సిద్దిక్, వాజీద్, సత్యం, డి ఈ హన్మాంతరావు, ఏఈ వేణు ప్రసాద్, తీపివో దేవరాజు, టిపిబిఓ మల్లికార్జున్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు...