పరశురాంపల్లి తరిలింపునకు సానుకూల స్పందన
పరశురాంపల్లి తరలింపునకు సానుకూల స్పందన
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబుకు ఎమ్మెల్యే గండ్ర ఆధ్వర్యంలో వినతి
గణపురం, సెప్టెంబర్ 28 మేజర్ న్యూస్ సూర్య:
గణపురం మండలంలోని పరశురాంపల్లి గ్రామ తరలింపునకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. సోమవారం ప్రజాభవన్‌లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో గ్రామస్థులు, కాంగ్రెస్ నాయకులు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబుకు వినతిపత్రం అందజేశారు.
ఓసీ-3లో రైతుల సాగుభూములు కోల్పోవడంతో పాటు బ్లాస్టింగ్ కారణంగా ఇళ్లకు పగుళ్లు ఏర్పడి నివాసానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కాలుష్యం కారణంగా గ్రామ ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పరశురాంపల్లి గ్రామాన్ని తరలించేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గణపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి భాస్కర్‌రావు, నాయకులు చింతిరెడ్డి సమ్మిరెడ్డి, కొడారి బాబు యాదవ్, పలకల రామ్‌రెడ్డి, పెంట రవీందర్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ ఉడత రవి, ఎర్రం సదానందం తదితరులు పాల్గొన్నారు.