నాలుగు జిల్లాలకు జిల్లా విద్యాధికారుల మార్పు
నాలుగు జిల్లాలకు జిల్లా విద్యాధికారుల మార్పు
వరంగల్,సెప్టెంబరు 28మేజర్ న్యూస్ (సూర్య):తెలంగాణ పాఠశాల విద్యా శాఖలో పలు జిల్లాల జిల్లా విద్యాధికారి పోస్టులకు సంబంధించి ప్రభుత్వం అదనపు బాధ్యతలను కేటాయిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నియామకాల ప్రకారం, కరీంనగర్ జిల్లా విద్యాధికారి కార్యాలయ సహాయ సంచాలకులు ఎన్. ప్రశాంత్ రెడ్డికి వరంగల్ జిల్లా విద్యాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. నిర్మల్ జిల్లా విద్యాధికారి కార్యాలయ సహాయ సంచాలకులు సిహెచ్. శ్రీనివాసరావును సూర్యాపేట జిల్లా విద్యాధికారిగా, భద్రాద్రి కొత్తగూడెం ఉప విద్యాధికారి డి. వసంతిని ఖమ్మం జిల్లా విద్యాధికారిగా నియమించారు. అలాగే కొత్తగూడెం జిల్లా విద్యాధికారి కార్యాలయ సహాయ సంచాలకులు శంభు ప్రసాద్‌కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాధికారిగా అదనపు బాధ్యతలు కేటాయించారు. జిల్లాల్లో విద్యాశాఖ పాలన సజావుగా సాగేందుకు వీలుగా ప్రభుత్వం ఈ మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.