మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలకు వైఎస్సార్‌సీపీ సన్మానం..
శ్రీకాకుళం సెప్టెంబర్ 29 మేజర్ న్యూస్ : 2021–2026 కాలంలో పదవీకాలం పూర్తి చేసిన మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలను జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అభినందన సభ నిర్వహించారు.
కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవీకాలంలో వివిధ సవాళ్లు ఎదురైనా ప్రజల పట్ల బాధ్యతతో విధులు నిర్వహించిన మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలను అభినందించారు. ప్రజా సేవలో వారు సంపాదించిన అనుభవాన్ని భవిష్యత్తులోనూ ప్రజలకు ఉపయోగపడేలా కొనసాగించాలని ఆకాంక్షించారు.
అనంతరం పదవీకాలం పూర్తి చేసిన మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీరియా విజయలక్ష్మి, ఎమ్మెల్సీ నర్తు రామారావు, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడే శ్యామ్‌ప్రసాద్, యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.