BREAKING
ఈయూ విస్తరణకు కొత్త నిబంధనలు గుండెజబ్బుల ముప్పు నుంచి బయటపడేందుకు జీవనశైలిలో మార్పులు అవసరం ఎల్పీజి -ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేశారా? నేడే చివరి గడువు! ఆక్రమిత భూములు మాత్రమే తొలగించిన అధికారులు గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత ఎస్ఐఆర్ ప్రక్రియలో పొరపాట్లకు తావివ్వొద్దు విద్య కమిటీలతో మంచి ఫలితాలు వస్తాయి. టిడిపి కూటమి ప్రభుత్వంలో నిరంతర విద్యుత్ ప్రజల ప్రాణాలతో చెలగాటం.. నకిలీ వైద్యుడు అరెస్ట్ పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి: ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కేసుల దర్యాప్తులో లోపాలకు తావివ్వొద్దు గ్రామ స్వరాజ్యం సాధన లక్ష్యంగా పల్లె పండుగ జిల్లాలో మొదటి రోజు సందడిగా ప్రారంభమైన పల్లె పండుగ కార్యక్రమం ఎమ్మెల్సీ ఓటు నమోదుకు పిలుపు కొండూరు పవన్ కుమార్ చింతపల్లి విద్యాకమిటీ ఎన్నికల్లోనూ చిత్ర విచిత్రలే...!

నరసన్నపేటలో ఆగని ఆక్రమణలు!

Select Suryaa Now
నరసన్నపేటలో ఆగని ఆక్రమణలు!

 

చెరువులు, రోడ్లపై యథేచ్ఛగా ఆక్రమణలు?

నరసన్నపేట సెప్టెంబర్ 29 మేజర్ న్యూస్ : నరసన్నపేట మేజర్‌ పంచాయతీ పరిధిలో ఆక్రమణల పరంపర కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములు, చెరువులు, రహదారులపై ఆక్రమణలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీవీఆర్‌ షాపింగ్‌ మాల్‌ ఎదురుగా నడిరోడ్డుపై దుకాణాలు ఏర్పాటు చేసి రహదారి స్థలాన్ని ఆక్రమించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై రెవెన్యూ, గ్రామపంచాయతీ అధికారులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మంగళవారం సూర్యనారాయణ స్వామి ఆలయం సమీపంలోని బసవన్న చెరువులో విలువైన భూమి ఆక్రమణకు గురవుతున్నట్లు స్థానికులు ఆరోపించారు. కోట్ల రూపాయల విలువైన చెరువు భూముల పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు. చెరువుల ఆక్రమణలు కొంతకాలంగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, రహదారులు ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు మౌనం వహించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, గ్రామపంచాయతీ అధికారులు సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వ భూములు, చెరువులు, రహదారులపై జరిగిన ఆక్రమణలను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.